Captain Smit Machchhar: ప్రయాణికుల ప్రాణాలు కాపాడిన సాహస పైలట్.. కెప్టెన్ స్మిత్ మచ్చర్‌కు ‘విశిష్ట గుజరాత్ గరిమా అవార్డు’!
Captain Smit Machchhar: ఫ్లైదుబాయ్ ఘటనలో ప్రాణాలకు తెగించి 174 మంది ప్రయాణికులను కాపాడిన భారతీయ పైలట్ స్మిత్ మచ్చర్‌కు గుజరాత్ ప్రభుత్వం అరుదైన గౌరవం. 'విశిష్ట గుజరాత్ గరిమా అవార్డు' ప్రకటన.
Captain Smit Machchhar: ప్రయాణికుల ప్రాణాలు కాపాడిన సాహస పైలట్.. కెప్టెన్ స్మిత్ మచ్చర్‌కు ‘విశిష్ట గుజరాత్ గరిమా అవార్డు’!
Captain Smit Machchhar: ఫ్లైదుబాయ్ ఘటనలో తోటి పైలట్ దాడి చేసినప్పటికీ, ఏమాత్రం బెదరక ప్రాణాలకు తెగించి 174 మంది ప్రయాణికుల ప్రాణాలను కాపాడిన భారతీయ కెప్టెన్ స్మిత్ మచ్చర్ ధైర్యసాహసాలపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ నేపథ్యంలో ఆయన తెగువను గౌరవిస్తూ గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ రాష్ట్ర అత్యున్నత పురస్కారమైన ‘విశిష్ట గుజరాత్ గరిమా అవార్డు’ను ప్రకటించారు. గుజరాత్‌కు చెందిన ఈ ధైర్యశాలి తన వీరత్వంతో రాష్ట్రం, దేశం కీర్తిని ఇనుమడింపజేశారని సీఎం ప్రశంసించారు.
తీవ్ర గాయాలపాలై రక్తంతో తడిసిపోయినప్పటికీ, ప్రయాణికుల భద్రతను మొదటి ప్రాధాన్యతగా ఎంచి ఆయన చూపిన తెగువ ఎంతో స్ఫూర్తిదాయకమని సీఎం భూపేంద్ర పటేల్ ఎక్స్ (ట్విటర్) వేదికగా కొనియాడారు.
మరోవైపు, స్మిత్ మచ్చర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ప్రఖ్యాత సోమనాథ్ ఆలయంలో పూజారులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయన ఆరోగ్యం మెరుగుపడాలని కోరుతూ మహామృత్యుంజయ మంత్ర జప అనుష్ఠానాన్ని ప్రారంభించారు.




