Paralakhemundi: గుమ్మ పీఎం శ్రీ పాఠశాలలో విద్యార్థుల నిరసన!
Paralakhemundi: గజపతి గుమ్మ సమితి పీఎం శ్రీ పాఠశాలలో ఉపాధ్యాయుడిపై SMC అధ్యక్షుడు దాడి చేశాడని విద్యార్థుల నిరసన. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్.
Paralakhemundi: గుమ్మ పీఎం శ్రీ పాఠశాలలో విద్యార్థుల నిరసన!
Paralakhemundi: గజపతి జిల్లా గుమ్మ సమితి గుమ్మ గ్రామ ప్రాంతంలో ఉన్నటువంటి పీఎం శ్రీ ఉన్నత పాఠశాల ప్రాంతంలో సోమవారం విద్యార్థులు నిరసన చేపట్టారు. వివరాల్లోకి వెళితే పాఠశాల మేనేజ్మెంట్ కమిటీ అధ్యక్షుడు
పాఠశాల ఉపాధ్యాయులుపై అసభ్యకరంగా ప్రవర్తించాలని, ఉపాధ్యాయులపై చేయి చేసుకున్నడంటూ విద్యార్థులు ఆరోపిస్తున్నారు. అలాంటి వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని నిరసన చేస్తున్నారు.
అదేవిధంగా అధ్యక్షుడు కుమార్తె పై ఇద్దరు ఉపాధ్యాయులు సభ్య కరమైన వ్యాఖ్యలు చేశారని ఆ కుటుంబ సభ్యులు ఆరోపించారు. దీంతో శనివారం ప్రధానోపాధ్యాయుడు, పోలీసులు, పాఠశాల కమిటీ సభ్యులు సమక్షంలో ఈ సంఘటనపై సమావేశం నిర్వహించి, రానున్న రోజు ఇలాంటి తప్పుడు జరగవని ఉపాధ్యాయులు అందరి ముందా క్షమాపణ అడిగారు.
అనంతరం పాఠశాల కమిటీ అధ్యక్షుడు ఉపాధ్యాయులపై చేయి చేసుకున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఘటనా స్థలానికి పోలీసులు ఉన్నత అధికారులు చేరుకొని చర్చిలు కొనసాగిస్తున్నారు.




