Paralakhemundi: గజపతి జిల్లాలో పాఠశాలలకు సెలవులు!

Paralakhemundi: ఒడిశాలో వాయుగుండం ప్రభావంతో భారీ వర్షాల హెచ్చరిక. గజపతి జిల్లాలో సెప్టెంబర్ 22 నుండి 24 వరకు పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలకు సెలవులు ప్రకటన.

S.Anil, Gajapati Dst
Published on: 22 Sept 2026 7:40 AM IST
Paralakhemundi
X

Paralakhemundi: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా గజపతి జిల్లాలో తీవ్ర వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో 22వ తేదీ నుంచి 24వ తేదీ వరకు జిల్లాలో ఉన్నటువంటి ప్రభుత్వ, ప్రభుత్వేతర విద్యాసంస్థలకు,అంగన్ వాడీ కేంద్రాలకు సెలవులు ప్రకటిస్తున్నట్లు విద్యాశాఖ అధికారి ఓ ప్రకటన విడుదల చేశారు. అదేవిధంగా

అత్యవసర పరిస్థితులకు సంసిద్ధత ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు అందరూ అందుబాటులో ఉండాలని, తమ మొబైల్ ఫోన్‌లను స్విచ్ ఆన్‌లో ఉంచుకోవాలి ,అత్యవసర కాల్స్‌కు, కేటాయించిన విధులకు స్పందించడానికి సిద్ధంగా ఉండాలని లేఖలో పేర్కొన్నారు

S.Anil, Gajapati Dst

S.Anil, Gajapati Dst