Paralakhemundi: గజపతి కలెక్టరేట్ ఎదుట సన్నలోబ గ్రామస్తుల నిరసన!

Paralakhemundi: గజపతి కలెక్టరేట్ ఎదుట సన్నలోబ గ్రామస్తుల నిరసన మూడో రోజుకు చేరిక. ఐటీడీఏ పీఏ 15 రోజులు గడువు కోరడంతో ఆందోళన విరమణ.

S.Anil, Gajapati Dst
Published on: 22 Sept 2026 9:05 AM IST
Paralakhemundi
X

Paralakhemundi: గజపతి కలెక్టరేట్ ఎదుట సన్నలోబ గ్రామస్తుల నిరసన!

Paralakhemundi: గజపతి జిల్లాలోని రాయగడ సమితి లైలై పంచాయతీ లోని సన్నలోబ గ్రామస్తులు అటవీ భూమి పట్టాలు అందజేయాలంటూ అటవీ భూమి పట్టాల కమిటీ అధ్యక్షుడు శంకర్ బుయాన్ అధ్యక్షతన కలెక్టర్ కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన సోమవారం మూడో రోజుకు చేరుకుంది.మూడు రోజులు నిరసన అనంతరం అధికారులు, ఐటీడీఏ పీఏ అన్షుమాన్ మహాపాత్ర్ దిగివచ్చి నిరసన కారులతో చర్చించి 15 రోజులు గడువు కోరారు.న్యాయవాది ప్రశాంత్ కుమార్ ప్రధాన్ మాట్లాడుతూ ఆదివాసులు న్యాయపరమైన అటవీ భూమి పట్టాలు పొందేందుకు ఐదేళ్లుగా అధికారుల వద్దకు పదేేపదే తిరిగినా కూడా సమస్య పరిష్కారం కాలేదని, చివరకు మూడు రోజులు నిరసన చేబడితే అధికారులు తమ వద్దకు వచ్చారని అన్నారు. ఇచ్చిన గడువు లోపల పట్టాలు అందజేయకపోతే తీవ్ర ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.

S.Anil, Gajapati Dst

S.Anil, Gajapati Dst