Parlakhemundi: పేకాట డెరాలపై పోలీసుల ఉక్కుపాదం.. మరో ఆరుగురు అరెస్ట్!
Parlakhemundi: గజపతి జిల్లా పర్లాఖెముండిలో పేకాట శిబిరాలపై పోలీసులు ముమ్మర దాడులు నిర్వహించి మరో ఆరుగురు నిందితులను అరెస్ట్ చేసి కోర్టుకు తరలించారు.
Parlakhemundi: పేకాట డెరాలపై పోలీసుల ఉక్కుపాదం.. మరో ఆరుగురు అరెస్ట్!
Parlakhemundi: గజపతి పోలీసులు పర్లాఖెముండి పట్టణం తో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో నిర్వహిస్తున్న పేకాట శిబిరాలపై ఈ మధ్యకాలంలో ముమ్మరంగా దాడులు నిర్వహించారు. గత మూడు రోజుల క్రితం పట్టణ ఆదర్శ ఠాణా పరిధిలోని దేవిది గ్రామ ప్రాంతంలోని కళ్యాణమండపంలో నిర్వహిస్తున్న శిబిరంపై దాడి చేసి సుమారు 71 మందిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మరో వేరే ప్రాంతాల్లో నిర్వహిస్తున్న శిబిరాలకు సంబంధించిన వ్యక్తులను అరెస్టు చేశారు. ఈ ఆరుగురు నిందితులను మంగళవారం సాయంత్రం కోర్టుకు తరలించారు. వీరిలో పర్లాఖెముండి, రాణి పేట గ్రామానికి చెందినవారుగా తెలుస్తోంది.




