Gajapati: గజపతి జిల్లాలో మహాత్మా గాంధీ జయంతి వేడుకలు!
Gajapati: గజపతి జిల్లా పర్లాఖెముండిలో గాంధీ, శాస్త్రి జయంతులు ఘనంగా జరిగాయి. ఎంపీ ప్రదీప్ కుమార్ పాణిగ్రహి, కలెక్టర్ అక్షయ్ సునీల్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
Gajapati: గజపతి జిల్లాలో మహాత్మా గాంధీ జయంతి వేడుకలు!
Gajapati: గజపతి జిల్లా అంతట శుక్రవారం మహాత్మా గాంధీ , లాల్ బహుదూర్ శాస్త్రి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.పర్లాఖెముండి పట్టణంలోని గ్రామీణ ఉపాధి శిక్షణ భవనంలో కలెక్టర్ అక్షయ్ సునీల్ అగర్వాల్ అధ్యక్షతన ఏర్పాటుచేసిన సమావేశానికి ముఖ్యఅతిథిగా బ్రహ్మపుర లోకసభ సభ్యుడు ప్రదీప్ కుమార్ పాణిగ్రహి,
అతిథులుగా పురపాలక అధ్యక్షురాలు నిర్మల శెఠి,సబ్ కలెక్టర్ భగత్ సమల్ కల్యాణ్ రావ్, అదనపు ఎస్పీ బిరంచి బాగ్, జిల్లా పరిషత్ కార్య నిర్వహణ అధికారి దయమయ పాఢి, అదనపు జిల్లా పరిషత్ కార్య నిర్వహణ అధికారి పృథ్వీరాజ్ మండల్ పాల్గొని గాంధీ, శాస్త్రి చిత్రపటాలు వద్ద పూలమాలవేసి నివాళులర్పించారు.
అనంతరం ఎంపీ ప్రదీప్ మాట్లాడుతూ శాంతియుతంగా స్వాతంత్ర పోరాటం చేసి ఆంగ్లేయుల గుండెల్లో దడ పుట్టించి జాతి పితగా కీర్తి పొందిన మహాత్మా గాంధీ ఎప్పటికీ ప్రజల హృదయాల్లో నిలిచిపోతారని అన్నారు. ఆనాటి కాలంలో మహాత్మా గాంధీ వద్ద సైన్యం లేదు ఆయుధాలు లేవు కానీ కోట్లాదిమంది ఆయన్ని ఆరాధిస్తున్నారని వివరించారు.
ముఖ్యంగా దేశం అభివృద్ధి చెందాలంటే మొదట మనం అభివృద్ధి చెందాలని అన్నారు. అనంతరం గాంధీ జయంతి పురస్కరించుకొని విద్యార్థుల మధ్య నిర్వహించిన పోటీల్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలతో పాటు జ్ఞాపికలను అందజేశారు. అదేవిధంగా పలువురికి కార్మిక గుర్తింపు కార్డులను అందజేశారు.




