Jagdeep Dhankhar: మాజీ ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్‌కు తీవ్ర అస్వస్థత.. హుటాహుటిన ఎయిమ్స్‌కు తరలింపు!

Jagdeep Dhankhar: మాజీ ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్‌ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.

Arun Chilukuri
Published on: 11 Nov 2026 5:23 PM IST
Jagdeep Dhankhar
X

Jagdeep Dhankhar: మాజీ ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్‌కు తీవ్ర అస్వస్థత.. హుటాహుటిన ఎయిమ్స్‌కు తరలింపు!

Jagdeep Dhankhar: భారత మాజీ ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్‌ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. రోజువారీ అలవాటులో భాగంగా మార్నింగ్‌ వాక్‌ చేస్తుండగా ఆయన అకస్మాత్తుగా స్పృహతప్పి పడిపోయినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. కొన్ని నిమిషాలపాటు ఆయన అపస్మారక స్థితిలోకి వెళ్లిపోవడంతో, వెంటనే స్పందించిన భద్రతా సిబ్బంది ఆయన్ను నివాసానికి తీసుకెళ్లారు. అక్కడే వైద్య బృందం ఆయనకు ప్రాథమిక చికిత్స అందించింది.

అయితే, ఆయన ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగానే ఉండటంతో వైద్యుల సూచన మేరకు హుటాహుటిన అంబులెన్స్‌లో ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఎయిమ్స్‌లోని కార్డియో-న్యూరో సెంటర్‌లో ఆయన్ను చేర్పించి, ప్రస్తుతం కార్డియాలజీ విభాగానికి చెందిన నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో అత్యవసర చికిత్స అందిస్తున్నట్లు సమాచారం. ఆయన ప్రస్తుత ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన పూర్తి వివరాలు అధికారికంగా వెలువడాల్సి ఉంది.

కాగా, జగదీప్‌ ధన్‌ఖడ్‌ 2022 ఆగస్టు నుంచి 2025 జులై వరకు భారత ఉపరాష్ట్రపతిగా సేవలు అందించిన విషయం విదితమే. ఆయన త్వరగా కోలుకోవాలని పలువురు ప్రముఖులు, రాజకీయ నాయకులు ఆకాంక్షిస్తున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.