Rashtrapati Bhavan: నార్త్ బ్లాక్‌లో భారీ అగ్నిప్రమాదం.. రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది

Rashtrapati Bhavan: ఢిల్లీలోని నార్త్ బ్లాక్‌లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. 6 అగ్నిమాపక వాహనాలు ఘటనాస్థలికి చేరుకుని మంటలను ఆర్పుతున్నాయి.

Arun Chilukuri
Updated on: 26 Oct 2026 12:46 PM IST
Rashtrapati Bhavan
X

Rashtrapati Bhavan: నార్త్ బ్లాక్‌లో భారీ అగ్నిప్రమాదం.. రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది

Rashtrapati Bhavan: దేశ రాజధాని ఢిల్లీలోని అత్యంత కీలకమైన వీఐపీ ప్రాంతంలో ఉన్న నార్త్ బ్లాక్‌లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. రాష్ట్రపతి భవన్, పార్లమెంట్ సమీపంలోనే ఈ భవనం ఉండటంతో ఈ ఘటన తీవ్ర ఆందోళనకు దారితీసింది. భవనం నుంచి ఒక్కసారిగా దట్టమైన నల్లటి పొగలు ఎగసిపడటంతో పరిసర ప్రాంతాల్లో కలకలం రేగింది.

సమాచారం అందుకున్న వెంటనే ఢిల్లీ ఫైర్ సర్వీసెస్ (DFS) అధికారులు అప్రమత్తమై 6 అగ్నిమాపక వాహనాలను వెంటనే ఘటనా స్థలానికి తరలించారు. ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చేందుకు చర్యలు చేపట్టారు. ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు, భవనానికి జరిగిన నష్టం మరియు ఎవరైనా గాయపడ్డారా అనే వివరాలు తెలియాల్సి ఉంది.

రాజ్యసభ సభ్యుడు మిలింద్ దేవరా పార్లమెంట్‌కు వెళ్తున్న సమయంలో నార్త్ బ్లాక్ వెనుక భాగం నుంచి పొగలు రావడం గమనించి ఫొటోతో సహా సామాజిక మాధ్యమం 'ఎక్స్' (ట్విట్టర్)లో పంచుకున్నారు. అక్కడ అగ్నిప్రమాదం జరిగి ఉండవచ్చని, అందరూ సురక్షితంగా ఉండాలని ఆశిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

భవనం వద్ద భద్రతా సిబ్బంది ఆంక్షలు విధిస్తూ పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ఫైర్ సిబ్బంది ప్రాథమిక పరిశీలన పూర్తయిన తర్వాత ప్రమాదంపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.