Central Government: సామాన్యులకు భారీ ఊరట.. పండుగలాంటి వార్త చెప్పిన కేంద్రం
Central Government: వంటనూనెల ధరలకు కళ్లెం వేసేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
Central Government: సామాన్యులకు భారీ ఊరట.. పండుగలాంటి వార్త చెప్పిన కేంద్రం
Central Government: కిచెన్ బడ్జెట్ మోత మోగిపోతున్న సమయాన కేంద్ర ప్రభుత్వం సామాన్యులకు అదిరిపోయే గుడ్ లెస్ ఇచ్చింది. దేశీయ మార్కెట్లో విపరీతంగా పెరుగుతున్న వంటనూనెల ధరలకు కళ్లెం వేసే దిశగా మోదీ సర్కార్ అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది. వివిధ రకాల ఎడిబుల్ ఆయిల్స్‌పై దిగుమతి సుంకాన్ని భారీగా తగ్గిస్తూ కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
క్రూడ్ సోయాబీన్ నూనె, క్రూడ్ పామ్ ఆయిల్‌పై ఇప్పటి వరకు అమల్లో ఉన్న 10 శాతం ప్రాథమిక కస్టమ్స్ డ్యూటీని ఏకంగా 5 శాతానికి తగ్గించారు. అలాగే, రిఫైండ్ సోయాబీన్ , పామ్ ఆయిల్‌పై పన్నును 32.5 శాతం నుంచి 27.5 శాతానికి కుదించారు. దేశంలో మెజారిటీ ఇళ్లలో విరివిగా వాడే సన్‌ఫ్లవర్ నూనె దిగుమతులపై ప్రభుత్వం మరింత వెసులుబాటు కల్పించింది. క్రూడ్ సన్‌ఫ్లవర్ నూనెపై ఉన్న 10 శాతం కస్టమ్స్ డ్యూటీని పూర్తిగా ఎత్తివేశారు. రిఫైండ్ సన్‌ఫ్లవర్ ఆయిల్ పన్నును 32.5 శాతం నుంచి 22.5 శాతానికి తగ్గించారు.
ఈ సవరించిన కస్టమ్స్ డ్యూటీ రేట్లు రేపటి నుంచే దేశవ్యాప్తంగా అమల్లోకి రానున్నాయి. పన్నుల తగ్గింపు కారణంగా నూనెల దిగుమతి వ్యయం భారీగా తగ్గనుంది. దీనివల్ల రాబోయే రోజుల్లో మార్కెట్లో వంటనూనెల రిటైల్ ధరలు దిగివచ్చి, సామాన్యుల జేబుపై పడుతున్న భారం గణనీయంగా తగ్గనుంది.




