DUSU Elections 2026: ‘గెలుపు అంచనాల్లో ఉండి కూడా ఎందుకు ఓడాం?’: డీయూఎస్‌యూ రిజల్ట్స్‌పై రాహుల్ గాంధీ ఆరా!

DUSU Elections 2026: ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్ (డీయూఎస్‌యూ) ఎన్నికల్లో ఎన్‌ఎస్‌యూఐ ఓటమిపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర ఆరా తీశారు.

Arun Chilukuri
Published on: 29 Sept 2026 1:21 PM IST
DUSU Elections 2026
X

DUSU Elections 2026: ‘గెలుపు అంచనాల్లో ఉండి కూడా ఎందుకు ఓడాం?’: డీయూఎస్‌యూ రిజల్ట్స్‌పై రాహుల్ గాంధీ ఆరా!

DUSU Elections 2026: ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్ (డీయూఎస్‌యూ) ఎన్నికల్లో ఎన్‌ఎస్‌యూఐ (NSUI) ఎదుర్కొన్న ఊహించని పరాజయంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్రంగా స్పందించారు. ఎన్నికల్లో గెలుపు అంచనాలతో బరిలోకి దిగినప్పటికీ, ఒక్క కేంద్ర పదవిని కూడా దక్కించుకోలేకపోవడంపై పార్టీ నాయకత్వం దృష్టి సారించింది. ఇందులో భాగంగా ఎన్‌ఎస్‌యూఐ ఇన్‌ఛార్జ్ కన్నయ్య కుమార్, జాతీయ అధ్యక్షుడు వినోద్ జాఖడ్, అలాగే కాంగ్రెస్ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో రాహుల్ గాంధీ ప్రత్యేకంగా సమావేశమయ్యారు.

అధ్యక్ష పదవికి ఎన్‌ఎస్‌యూఐ అభ్యర్థి విజయ్ శంకర్ మీనా చివరి వరకు గట్టి పోటీనిచ్చి కేవలం 2,053 ఓట్ల తేడాతో ఓడిపోవడంపై రాహుల్ ఆరా తీశారు. "గెలిచేందుకు చాలా దగ్గరకు వచ్చాం, తర్వాత ఏం జరిగింది?" అని ఆయన ప్రశ్నించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

మాజీ ఎన్‌ఎస్‌యూఐ సభ్యుడు దీపాంశు షోకీన్ టికెట్ దక్కక స్వతంత్ర అభ్యరిగా బరిలోకి దిగి ఉపాధ్యక్ష పదవిని భారీ మెజారిటీతో గెలుచుకోవడంపై చర్చ జరిగింది. షోకీన్‌ను పార్టీలో ఎందుకు కొనసాగించలేకపోయారని రాహుల్ ప్రశ్నించగా, ఆయన షరతులు ఆమోదయోగ్యంగా లేవని నేతలు వివరించినప్పటికీ, ఈ వ్యవహారాన్ని నిర్వహించిన తీరుపై రాహుల్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం.

డీయూఎస్‌యూ కేంద్ర ప్యానెల్‌లో నాలుగు పదవులకు గాను అధ్యక్షుడు, కార్యదర్శి, సంయుక్త కార్యదర్శి స్థానాలను ఏబీవీపీ కైవసం చేసుకోగా, ఉపాధ్యక్ష పదవిని స్వతంత్ర అభ్యర్థి దీపాంశు దక్కించుకున్నారు. ఎన్‌ఎస్‌యూఐ మాత్రం ఒక్క స్థానానికే పరిమితం కాలేకపోయింది.

దేశవ్యాప్తంగా జెన్-జీ యువత రాజకీయాలపై చూపుతున్న ఆసక్తి, విద్యార్థి ఉద్యమాలు, ప్రచార వ్యూహాలపై ఈ భేటీలో విస్తృతంగా చర్చించారు. పార్టీ యువజన విభాగాన్ని మరింత పటిష్టం చేసేందుకు భవిష్యత్ కార్యాచరణపై నాయకత్వం దృష్టి సారించింది.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.