Number Plate: బ్లూ నంబర్ ప్లేట్ ఎవరికి ఇస్తారు.? భారత్‌లో నెంబర్ ప్లేట్స్ కలర్స్ వెనుక రహస్యమిదే.!

Number Plate: భారతదేశంలో వాహనాలకు ఉపయోగించే వివిధ రంగుల నంబర్ ప్లేట్ల అర్థాలు, వాటి ప్రాముఖ్యత గురించి ఆసక్తికర వివరాలు ఇప్పుడు తెలుసుకుందామా.

Ravi
By Ravi
Published on: 27 Nov 2026 5:24 PM IST
Number Plate
X

Number Plate: బ్లూ నంబర్ ప్లేట్ ఎవరికి ఇస్తారు.? భారత్‌లో నెంబర్ ప్లేట్స్ కలర్స్ వెనుక రహస్యమిదే.!

Number Plate: రోడ్డుపై బ్లూ కలర్ నంబర్ ప్లేట్ కనిపిస్తే అది సాధారణ వ్యక్తికి చెందిన కారు కాదని, విదేశీ దౌత్యవేత్తల వాహనమని గుర్తుంచుకోవాలి. భారతదేశంలో వాహనాల వర్గీకరణ కోసం తెల్లటి, పసుపు రంగు నంబర్ ప్లేట్లతో పాటు మరికొన్ని ప్రత్యేక రంగుల ప్లేట్లు కూడా అమల్లో ఉన్నాయి. వాహన స్వభావాన్ని, వినియోగాన్ని సులభంగా గుర్తించడానికి ఈ రంగుల విధానం ఉపయోగపడుతుంది. సాధారణ పర్సనల్, ప్రైవేట్ వాహనాలకు వైట్ నంబర్ ప్లేట్ ఉపయోగిస్తారు. టాక్సీలు, గూడ్స్ రవాణా వాహనాలకు ఎక్కువగా ఎల్లో నంబర్ ప్లేట్ ఉంటుంది. పర్యావరణ హితమైన ఎలక్ట్రిక్ వాహనాల కోసం గ్రీన్ నంబర్ ప్లేట్ కేటాయిస్తారు.

కమర్షియల్‌గా రిజిస్టర్ అయినప్పటికీ, అద్దెకు ఇచ్చే వాహనాలకు బ్లాక్ నంబర్ ప్లేట్ వాడతారు. రెడ్ నంబర్ ప్లేట్ విషయంలో రెండు రకాలు ఉంటాయి. కొత్తగా కొన్న వాహనాలకు గరిష్టంగా ఒక నెల వ్యాలిడిటీతో తాత్కాలిక రిజిస్ట్రేషన్ కోసం రెడ్ ప్లేట్ ఇస్తారు. నంబర్ లేకుండా కేవలం అశోక చిహ్నం ఉన్న రెడ్ ప్లేట్‌ను రాష్ట్రపతి వంటి ఉన్నత ప్రభుత్వ అధికారులు ఉపయోగిస్తారు. అలాగే బ్లూ కలర్ నంబర్ ప్లేట్ ఫారెన్ డిప్లమేట్స్‌కు కేటాయిస్తారు. నంబర్ ప్లేట్‌పై పైకి చూపే ఆరో మార్క్ ఉంటే అది డిఫెన్స్ వాహనంగా గుర్తించాలి. ఇలాంటి వాహనాలను ఆర్మీ, నేవీ విభాగాలు ఉపయోగిస్తాయి.

ప్రయాణాల సమయంలో రహదారి నియమాలను పాటించడంతో పాటు వాహనాల గుర్తింపు చిహ్నాలపై అవగాహన ఉండటం ఎంతో అవసరం. వివిధ రంగుల నంబర్ ప్లేట్లు ఆయా వాహనాల అధికారిక హోదాను స్పష్టంగా సూచిస్తాయి. రహదారులపై కనిపించే ఈ విభిన్న ప్లేట్లు భారత రవాణా వ్యవస్థలోని వర్గీకరణ విధానాన్ని ప్రతిబింబిస్తాయి.

Ravi

Ravi

2017లో వెబ్ జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్స్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్ మీడియాలో 7 ఏళ్ళకుపైగా అనుభవం ఉంది. ట్రెండింగ్, బిజినెస్, ఆంధ్రప్రదేశ్ & తెలంగాణకు సంబంధించి బ్రేకింగ్ కంటెంట్ రాస్తుంటాను.