Parlakhemundi: మృతదేహాన్ని ఆటోలో తరలించిన కుటుంబ సభ్యులు!
Parlakhemundi: ఒడిశాలోని గజపతి జిల్లా మోహన ఆరోగ్య కేంద్రంలో మహాప్రయాణ వాహనం లేకపోవడంతో సంతోష్ సాహు అనే వ్యక్తి మృతదేహాన్ని కుటుంబ సభ్యులు ఆటోలో స్వగ్రామానికి తరలించారు.
Parlakhemundi: మృతదేహాన్ని ఆటోలో తరలించిన కుటుంబ సభ్యులు!
Parlakhemundi: ఆసుపత్రిలో మృతి చెందిన వ్యక్తిని స్వగ్రామానికి తరలించేందుకు ఆరోగ్య కేంద్రంలో మహాప్రయాణ వాహనం లేకపోవడంతో చివరకు కుటుంబ సభ్యులు ఆటోలో మృతదేహాన్ని గ్రామానికి తరలించారు. ఇలాంటి ఘటన గజపతి జిల్లా మోహన రాణా పరిధిలో శనివారం చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే... లుహాగుడి గ్రామానికి చెందిన సంతోష్ సాహు (58) అస్వస్థతకు గురై ఇంట్లో పడిపోగా కుటుంబ సభ్యులు వెంటనే మోహన ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అప్పటికే సాహు మృతి చెంది నట్లు వైద్యులు తెలిపారు.
దీంతో మృతదేహాన్ని గ్రామానికి తరలించేందుకు వాహనం లేకపోవడంతో సొంత సొమ్ముతో ఆటోలో ఇంటికి తరలించారు. ఇప్పటికైనా ఆరోగ్య కేంద్రంలో ఓ వాహనాన్ని ఉంచాలని స్థానికులు డిమాండు చేస్తున్నారు.




