Parlakhemundi: వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి సూర్య వంశీ సూరజ్ పర్యటన!
Parlakhemundi: ఆర్నబ్ తుఫానుతో గజపతి జిల్లాలో కొండచరియలు విరిగిపడి దారులు మూతపడ్డాయి. మహేంద్ర తనయ వరద ప్రాంతాల్లో మంత్రి సూర్య వంశీ సూరజ్ పర్యటించారు.
Parlakhemundi: వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి సూర్య వంశీ సూరజ్ పర్యటన!
Parlakhemundi: ఆర్నబ్ తుఫాను ప్రభావంతో గజపతి జిల్లాలో ఎడతెరిపి లేని వర్షాలు కురిసాయి. మహేంద్ర తనయ నదిలో ఉద్రిక్తంగా వరద నీరు ప్రవహిస్తుంది. ఈ నేపథ్యంలో బుధవారం రాత్రి కుండపోత వర్షం కురిసింది. రాయగడ సమితి కోయిపూర్-గంగాబాడో రహదారిలో కొండ చరియలు విరిగిపడ్డాయి.50 మీటర్ల వరకు మట్టి, రాళ్లు పేరుకుపోయినట్లు సమాచారం. గంగాబాడో పంచాయతీ నుండి సమితి ఉన్న రహదారి సంబంధాలు తెగిపోయాయి. అదేవిధంగా అర్ధరాత్రి గుసాని సమితి మహేంద్ర తనయ నదీ ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామాల్లో రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ మంత్రి సూర్య వంశీ సూరజ్ పర్యటించి ఆయా ప్రాంతాల ప్రజలతో మాట్లాడారు. గురువారం వేకువజామున ఈదురు గాలులతో వర్షం కురుస్తుంది.




