పోస్ట్ పెట్టి గంటల్లోనే డిలీట్ చేసిన కాంగ్రెస్.. సీజేఐ జస్టిస్ సూర్యకాంత్‌పై ట్వీట్‌తో దేశవ్యాప్తంగా కలకలం!
సుప్రీంకోర్టు సీజేఐ జస్టిస్ సూర్యకాంత్‌పై కాంగ్రెస్ కేరళ విభాగం చేసిన వివాదాస్పద పోస్ట్ ఉపసంహరణ. కాంగ్రెస్ వైఖరిపై కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు, బీజేపీ నేతల తీవ్ర ఆగ్రహం.
పోస్ట్ పెట్టి గంటల్లోనే డిలీట్ చేసిన కాంగ్రెస్.. సీజేఐ జస్టిస్ సూర్యకాంత్‌పై ట్వీట్‌తో దేశవ్యాప్తంగా కలకలం!
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ సూర్యకాంత్‌ను ఉద్దేశించి కాంగ్రెస్ కేరళ విభాగం చేసిన సామాజిక మాధ్యమ పోస్ట్ దేశవ్యాప్తంగా తీవ్ర వివాదాస్పదమైంది. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న సీజేఐ రాజీనామా చేయాలంటూ చేసిన ఈ పోస్ట్‌పై తీవ్ర నిరసనలు వ్యక్తమవ్వడంతో, వెనక్కి తగ్గిన కాంగ్రెస్ పార్టీ ఆ పోస్ట్‌ను డిలీట్ చేసింది.
ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో సుప్రీంకోర్టు సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నగరంలో జరుగుతున్న ఆందోళనలు, ట్రాఫిక్ ఆంక్షల విధింపుపై విలేకరులు ఆయనను ప్రశ్నించగా.. అది శాంతిభద్రతల అంశమని, తన పరిధిలోనిది కాదని స్పష్టం చేశారు.
ఆయన వ్యాఖ్యలపై కాంగ్రెస్ కేరళ విభాగం సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పించింది. "డియర్ సూర్యకాంత్.. శాంతి భద్రతల అంశం మీ పరిధిలో లేకుంటే రాజీనామా చేయండి. మీ స్థానంలో శాంతి భద్రతలను చూసుకునే మరొకరిని మేం చూసుకుంటాం" అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు పోస్ట్ చేసింది.
కాంగ్రెస్ చేసిన వ్యాఖ్యలపై భారతీయ జనతా పార్టీ (BJP) తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. రాజ్యాంగ వ్యవస్థలను కాంగ్రెస్ పార్టీ వరుసగా కించపరుస్తోందని మండిపడింది.
"కాంగ్రెస్ తదుపరి లక్ష్యం న్యాయ వ్యవస్థే. రాజ్యాంగ, ప్రజాస్వామ్య వ్యవస్థలన్నింటినీ ధ్వంసం చేయాలని ఆ పార్టీ కంకణం కట్టుకుంది. భారత వ్యతిరేక శక్తులన్నీ ఇప్పుడు ఏకమవుతున్నాయి" అని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు తీవ్రంగా విమర్శించారు.
పోస్ట్ పట్ల సొంత పార్టీలోనే కాకుండా అంతటా తీవ్ర నిరసన వ్యక్తమవడం, రాజకీయంగా దుమారం రేగడంతో కాంగ్రెస్ పార్టీ కొన్ని గంటల్లోనే ఆ వివాదాస్పద పోస్ట్‌ను సోషల్ మీడియా నుంచి తొలగించింది.




