Abhijeet Dipke: సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే ఇంట తీవ్ర విషాదం
Abhijeet Dipke: కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే నానమ్మ సావిత్రి బాయి (85) కన్నుమూశారు. ఆయన ప్రస్తుతం దిల్లీ పోలీసుల అదుపులో ఉన్న సమయంలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది.
Abhijeet Dipke: సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే ఇంట తీవ్ర విషాదం
Abhijeet Dipke: దిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన ప్రకటనల వేళ అదుపులోకి తీసుకున్న కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే (Abhijeet Dipke) ఇంట తీవ్ర శోకఛాయలు అలముకున్నాయి. ఆయన నానమ్మ సావిత్రి బాయి (85) శనివారం ఉదయం కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె, మహారాష్ట్రలోని హింగోలి జిల్లా 'సంతుక్ పింప్రి'లోని తమ స్వగృహంలో తుదిశ్వాస విడిచారని కుటుంబ సభ్యులు వెల్లడించారు.
దిల్లీ విమానాశ్రయంలో ల్యాండ్ అయిన వెంటనే పోలీసులు అభిజీత్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఆయన కస్టడీలోనే ఉండటంతో బంధువులు నేరుగా సంప్రదించలేకపోయారు. అనంతరం దిల్లీ పోలీసులు ఈ విషాద వార్తను అభిజీత్‌కు తెలియజేశారు.
సావిత్రి బాయి అంత్యక్రియలను ఆదివారం ఉదయం 10 గంటలకు సంతుక్ పింప్రి గ్రామంలో నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. తల్లిదండ్రులు ఇప్పటికే గ్రామానికి పయనమయ్యారు.
దిల్లీ పోలీసుల కస్టడీలోనే ఉంటూ నిరసన వ్యాఖ్యలను కొనసాగించాలా? లేక నానమ్మ చివరి చూపు కోసం మహారాష్ట్రకు తిరిగి వెళ్లాలా? అనేది ఇప్పుడు అభిజీత్ దీప్కే నిర్ణయంపైనే ఆధారపడి ఉందని దిల్లీ పోలీసు వర్గాలు తెలిపాయి.
ఆగస్టు 15న హింగోలి జిల్లాలో చేపట్టిన ‘స్కూల్ ఠీక్ కరో’ కార్యక్రమం సందర్భంగా అభిజీత్ తన నానమ్మను కలశారు. గత 20-25 రోజులుగా ఆమెను కలవలేకపోయారని సంబంధిత వర్గాలు తెలిపాయి.




