Jantar Mantar: పోలీసులకే షాకిచ్చిన యువతి.. ఆందోళనల మధ్య బస్సు తాళాలు తీసుకుని పరార్!

Jantar Mantar: సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా కోరుతూ దిల్లీ జంతర్‌మంతర్‌ వద్ద జరిగిన ఆందోళనల్లో ఉద్రిక్తత చోటుచేసుకుంది.

Arun Chilukuri
Published on: 5 Oct 2026 12:37 PM IST
Jantar Mantar
X

Jantar Mantar: పోలీసులకే షాకిచ్చిన యువతి.. ఆందోళనల మధ్య బస్సు తాళాలు తీసుకుని పరార్!

Jantar Mantar: ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తూ దిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద ఆదివారం చేపట్టిన ఆందోళనలు తీవ్ర ఉద్రిక్తతకు దారితీశాయి. ఈ నిరసనల్లో పాల్గొన్న ఆందోళనకారులను అడ్డుకునేందుకు ప్రయత్నించిన పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకున్నారు.

ఆందోళనకారులను శాంతింపజేసేందుకు, అక్కడి నుంచి తరలించేందుకు పోలీసులు కొందరిని అదుపులోకి తీసుకుని బస్సులోకి ఎక్కించారు. నిరసనకారులను తరలిస్తున్న సమయంలో ఓ యువతి అనూహ్యంగా బస్సు తాళాలు (Bus Keys) తీసుకుని అక్కడి నుంచి పరుగెత్తింది.

బస్సు తాళాలు లేకపోవడంతో డ్రైవర్ బస్సును కదిలించలేకపోయాడు. దీంతో చేసేది లేక పోలీసులు రోడ్డు మధ్యలో ఆగి ఉన్న ఆ బస్సును బలంగా తోసుకుంటూ పక్కకు తరలించారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో విపరీతంగా వైరల్‌గా మారాయి.

సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ తన పదవికి రాజీనామా చేసే వరకు తమ నిరసనలు ఆగే ప్రసక్తే లేదని అఖిల భారత విద్యార్థి సంఘం కార్యకర్తలు మరియు ఆప్‌ (AAP) నేతలు స్పష్టం చేశారు. సోమవారం కూడా జంతర్‌మంతర్‌‌ వద్ద ఆందోళనలు కొనసాగిస్తామని వారు హెచ్చరించడంతో దిల్లీలో పోలీసులు భారీగా మోహరించారు.


Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.