Parlakhemundi: కార్మిక అధికారిపై కఠిన చర్యలు తీసుకోవాలి!
Parlakhemundi: ఒడిశా గజపతి జిల్లా పర్లాఖెముండి కార్మిక శాఖ అధికారి మానస్ కుమార్ సాహుపై చర్యలు తీసుకోవాలని భీమ్ ఆర్మీ నిరసన చేపట్టి అదనపు కలెక్టర్కు వినతిపత్రం అందజేసింది.
Parlakhemundi: కార్మిక అధికారిపై కఠిన చర్యలు తీసుకోవాలి!
Parlakhemundi: పర్లాఖెముండి లోని జిల్లా కార్మిక శాఖ కార్యాలయంలో అదనపు జిల్లా కార్మిక శాఖ అధికారిగా బాధితులు నిర్వహించిన మానస్ కుమార్ సాహు పై కఠిన చర్యలు తీసుకోవాలని భీమ్ ఆర్మీ సభ్యులు డిమాండ్ చేశారు. మంగళవారం పర్లాఖెముండి పట్టణంలోని కొత్త బస్టాండ్ ప్రాంతంలో ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం ఆ ప్రాంతం నుంచి సుమారు రెండు కిలోమీటర్ల మేరకు నిరసన చేపడుతూ ర్యాలీగా కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్నారు. ఈ నిరసనకు మద్దతుగా రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి బిజయ్ కుమార్ పట్నాయక్ మద్దతు ప్రకటించారు.
భీమ్ ఆర్మీ అధ్యక్షుడు అన్సలాం నాయక్ మాట్లాడుతూ ప్రభుత్వం కార్మికుల కోసం ఎన్నో రకాల పథకాలు అమలు చేస్తుందని, కొంతమంది అధికారం నిర్లక్ష్యం కారణంగా కార్మికులకు అవి అందకపోవడం చాలా బాధాకరమని అన్నారు. కార్మిక గుర్తింపు కార్డు ఉన్న కార్మికుడు పలు పథకాలకు లబ్ధిదారుడై ఉన్నప్పటికీ ఇలాంటి అధికారుల వలన అవి పొందలేకపోతున్నాడని, అలాంటి అధికారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
నెలల తరబడి వివాహం, మృతి ఆర్థిక పథకం కింద కొంతమంది లబ్ధిదారులు దరఖాస్తులు చేసుకున్నప్పటికీ, వారికి నిధులు మంజూరు చేయకుండా ఈ మధ్యకాలంలో దరఖాస్తు చేసుకున్న వారికి నిధులు మంజూరు చేస్తున్నారని, దీనికి ముఖ్య కారణం వారి వద్ద డబ్బులు తీసుకొని పనులు చేస్తున్నట్లు ఆరోపించారు. ఇలాంటి అధికారం వలన ఎంతోమంది కార్మికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. అనంతరం కలెక్టర్ పేరిట రాసిన వినతి పత్రాన్ని అదనపు కలెక్టర్ ఫాల్గుణ మాఝి కు
అందజేస్తూ... మాజీ ప్రధాన కార్యదర్శి బిజయ్ కుమార్ పట్నాయక్ మాట్లాడుతూ కార్మికుల సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని, అ అధికారిని పిలిపించి ఈ సంఘటనపై త్వరత గతిన విచారణ చేపట్టి కార్మికులకు న్యాయం చేపట్టాలని అన్నారు. లేనిచో రానున్న రోజుల్లో తీవ్ర ఆందోళనలు జరుగుతాయని అన్నారు.




