PM Modi: ప్రపంచంలోనే నంబర్ వన్ హెల్త్ స్కీమ్.. ఆయుష్మాన్ భారత్ మైలురాయిపై మోదీ హర్షం!

PM Modi: ఆరోగ్యవంతమైన సమాజం కోసం కేంద్ర ప్రభుత్వం తెచ్చిన ఆయుష్మాన్‌ భారత్ పథకం ఎనిమిదేళ్లు పూర్తి చేసుకుంది.

Arun Chilukuri
Published on: 23 Sept 2026 1:06 PM IST
PM Modi
X

PM Modi: ప్రపంచంలోనే నంబర్ వన్ హెల్త్ స్కీమ్.. ఆయుష్మాన్ భారత్ మైలురాయిపై మోదీ హర్షం!

PM Modi: ఆరోగ్యవంతమైన సమాజ స్థాపనే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన 'ఆయుష్మాన్‌ భారత్‌' (AB-PMJAY) పథకం విజయవంతంగా ఎనిమిదేళ్లు పూర్తి చేసుకుంది. ఈ పథకం ప్రారంభమై దశాబ్ద కాలానికి చేరువవుతున్న తరుణంలో ప్రధాని నరేంద్ర మోదీ సోషల్ మీడియా వేదికగా హర్షం వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా కోట్లాది పేద కుటుంబాలకు ఈ పథకం ఏవిధంగా భరోసా ఇస్తోందో వివరించారు.

ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య సంరక్షణ పథకం..

ఆయుష్మాన్‌ భారత్ కింద దేశవ్యాప్తంగా దాదాపు 60 కోట్ల మంది లబ్ధిదారులు ఏడాదికి రూ.5 లక్షల చొప్పున ఆరోగ్య బీమా రక్షణ పొందుతున్నట్లు ప్రధాని మోదీ వెల్లడించారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య సంరక్షణ పథకంగా నిలిచిందని కొనియాడారు. దేశంలోని ప్రతి గడపకూ నాణ్యమైన వైద్య సంరక్షణ చేరువవుతుండటంతో క్షేత్రస్థాయిలో ప్రాథమిక ఆరోగ్య వ్యవస్థ బలోపేతం అవుతోందని పేర్కొన్నారు. ప్రధాని మోదీ ఈ పథకాన్ని తొలిసారిగా 2018లో ఝార్ఖండ్‌లో ప్రారంభించిన విషయం తెలిసిందే.

ఈ పథకం సాధించిన మైలురాళ్లపై కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా మాట్లాడుతూ కీలక వివరాలను పంచుకున్నారు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 48.54 కోట్ల మందికి పైగా అర్హులకు ఆయుష్మాన్ కార్డులు జారీ చేసినట్లు తెలిపారు. అలాగే, దేశవ్యాప్తంగా ఉన్న 39 వేలకు పైగా నమోదిత ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల ద్వారా రూ.2 లక్షల కోట్లకు పైగా విలువైన ఉచిత వైద్య సేవలను అందించినట్లు స్పష్టం చేశారు. పెరుగుతున్న వైద్య ఖర్చుల భారం సామాన్య ప్రజలపై పడకుండా ఉండాలనే ఉద్దేశంతోనే ప్రధాని మోదీ ఈ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని ఆయన పేర్కొన్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.