Abhijeet Dipke: తిరంగా మార్చ్ వేళ తీవ్ర ఉత్కంఠ.. అభిజీత్ దీప్కే నివాసానికి చేరుకున్న దిల్లీ పోలీసులు!
Abhijeet Dipke: దిల్లీలో సీజేపీ ‘తిరంగా మార్చ్’ ఉద్రిక్తత. కరోల్‌బాగ్‌లో సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే బస చేసిన నివాసానికి వెళ్లిన దిల్లీ పోలీసులు.
Abhijeet Dipke: తిరంగా మార్చ్ వేళ తీవ్ర ఉత్కంఠ.. అభిజీత్ దీప్కే నివాసానికి చేరుకున్న దిల్లీ పోలీసులు!
Abhijeet Dipke: దేశ రాజధాని దిల్లీలో సీజేపీ (CJP) శుక్రవారం తలపెట్టిన ‘లెహరా దో తిరంగా’ (Lehra Do Tiranga) మార్చ్ నేపథ్యంలో తీవ్ర ఉత్కంఠ పరిస్థితులు నెలకొన్నాయి. ర్యాలీ ప్రారంభానికి ముందే సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే బస చేసిన కరోల్‌బాగ్‌లోని ఇంటికి దిల్లీ పోలీసులు భారీగా చేరుకున్నారు. ఈ పరిణామంతో రాజధానిలో రాజకీయ వేడి ఒక్కసారిగా రాజుకుంది.
సీజేపీ ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ‘తిరంగా మార్చ్’ నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తగా పోలీసులు చర్యలు వేగవంతం చేశారు. ఇందులో భాగంగా అభిజీత్ దీప్కే బస చేసిన స్థలానికి పోలీసులు వెళ్లారు.
తిరంగా మార్చ్ ప్రారంభానికి ముందే పోలీసులు తనను అదుపులోకి తీసుకునే లేదా గృహ నిర్బంధం చేసే అవకాశం ఉందంటూ అభిజీత్ దీప్కే ఇదివరకే వ్యాఖ్యానించారు.
గురువారమే దిల్లీకి చేరుకున్న అభిజీత్.. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) నేత అనిశ్ గవండేకు చెందిన కరోల్‌బాగ్ నివాసంలో బస చేశారు.
సీజేపీ తిరంగా మార్చ్ పిలుపుతో దిల్లీలోని పలు కీలక ప్రాంతాల్లో పోలీసులు భద్రతను తీవ్రతరం చేశారు. అనుమతులు లేవంటూ ర్యాలీని అడ్డుకునేందుకు ముందస్తు అరెస్టులకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.




