Parlakhemundi: గజపతి జిల్లాలో 460 లీటర్ల నాటు సారా స్వాధీనం!
Parlakhemundi: ఒడిశా గజపతి జిల్లాలో రూ. 92 వేల విలువైన 460 లీటర్ల నాటు సారాను అబ్కారీ అధికారులు స్వాధీనం చేసుకుని ఒకరిని అరెస్టు చేశారు.
Parlakhemundi: గజపతి జిల్లాలో 460 లీటర్ల నాటు సారా స్వాధీనం!
Parlakhemundi: గజపతి జిల్లాలో అక్రమంగా కారులో తరలిస్తున్న నాటు సారాను అబ్కారీ అధికారులు తనిఖీలు చేపట్టి శనివారం స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయమై పర్లాఖెముండి లోని అబ్కారీ కార్యక్రమంలో ఇన్స్ స్పెక్టర్ కె తిరుపతి పట్నాయక్ విలేకరుల సమావేశంలో వివరాలు ఇలా వెల్లడించారు .
దుర్గాపూజ సందర్భంగా అక్రమంగా సారా అమ్మకాలు చేపడుతున్న పలు ప్రాంతాల్లో ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నామని, ఈ నేపథ్యంలో శనివారం వేకువజామున నువాగడ సమితి పరిసల్,ఖజిరిపోద గ్రామ ప్రధాన రహదారి మధ్యలో తనిఖీలు నిర్వహిస్తున్న తరుణంలో ఆ వైపుగా వస్తున్న కారును ఆపగా, తమను చూసి వేగముగా ముందుకు సాగాడని, వెనక వెంబడించగా కొద్ది మేరకు వెళ్లి రహదారి పక్కన కొండను ఢీకొని డ్రైవర్ పరారయ్యాడని, వాహనంలో డ్రైవర్ పక్కన కూర్చున్న నిందితుడుతో పాటు సుమారు 23 ప్లాస్టిక్ డబ్బాల్లో ఉన్న సారాను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
కారులో ఉన్న సారా సుమారు 460 లీటర్లు కాగా విలువ రూ 92 వేలు ఉంటుందని తెలిపారు. నిందితుడు పరిసల గ్రామానికి చెందిన గగన సబర్ (50) అరెస్టు చేసి కోర్టుకు తరలిస్తున్నట్లు వివరించారు. అదేవిధంగా స్వాధీనం చేసుకున్న కారు ధర రూ 10 లక్షలు ఉంటుందని, దీనికి సంబంధించి నిందితులను త్వరలో పట్టుకుంటామని అన్నారు. ఈ దాడులు కొనసాగుతాయని తెలిపారు.ఈ దాడుల్లో ఓఐసీ బబున్ కుమార్ బెహరా , ఏఎస్సై నీలంబర్ నాయక్, మినతి పాయిక్ తో పాటు బృందం పాల్గొన్నారు.




