Parlakhemundi: గజపతి జిల్లాకు 19 మంది నూతన వైద్యుల నియామకం!

Parlakhemundi: ఒడిశాలోని గజపతి జిల్లాలో వైద్యుల కొరత తీర్చేందుకు ప్రభుత్వం 19 మంది నూతన వైద్యులను నియమించింది.

S.Anil, Gajapati Dst
Published on: 11 Oct 2026 7:10 AM IST
Parlakhemundi
X

Parlakhemundi: గజపతి జిల్లాకు 19 మంది నూతన వైద్యుల నియామకం!

Parlakhemundi: గజపతి జిల్లాలో ఉన్నటువంటి ప్రధాన ఆసుపత్రితో పాటు ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆరోగ్య కేంద్రాల్లో గత కొద్ది ఏళ్ళుగా వైద్యుల కొరత తీవ్రంగా వేధిస్తుంది.ఈ నేపథ్యంలో జిల్లాకు వైద్యులను రాష్ట్ర ప్రభుత్వం నియమిస్తున్నట్లు భాజాపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కోడూరు నారాయణరావు తెలిపారు.

ఈ విషయమై పర్లాఖెముండి పట్టణంలోని డోలో ట్యాంక్ ప్రాంతంలో ఉన్న పార్టీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం వివరాలు ఇలా వెల్లడించారు. నారాయణరావు మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో, భాజాపా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పలుమార్లు జిల్లాలో వైద్యులను భర్తీ చేయాలని ఆరోగ్య శాఖ మంత్రి వద్ద ప్రస్తావించానని, దీంతో 19 మంది వైద్యులను నియమిస్తున్నట్లు ఓ సంతోషకరమైన విషయాన్ని వెల్లడించారని తెలిపారు.

దీంతో వైద్యులు లేక రోగులు గత కొద్ది ఏళ్లుగా ఆంధ్రప్రదేశ్‌ లోని శ్రీకాకుళం, విశాఖపట్నం కి వెళ్లి చికిత్స చేసుకునే వారని, దీంతో వారు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడేవారని, వైద్యులు నియామకం అనంతరం వైద్యులు సమస్యలు పరిష్కారం అవుతాయని అన్నారు. అదేవిధంగా విడతలవారీగా జిల్లాలో వైద్యుల భర్తీ చేయడం జరుగుతుందని, జిల్లాలో వైద్యుల కొరత తగ్గించేందుకు కృషి చేస్తానని అన్నారు.

ప్రస్తుతానికి 19 మంది వైద్యులలో ఇద్దరు పీజీ చదివేందుకు వెళ్తారని, మరో 17 మంది ఈ మధ్యకాలంలో విధులు నిర్వహిస్తారని అన్నారు. జిల్లాలోని అన్ని వైద్య కేంద్రాల్లో ఇక వైద్యులు ఉంటారని, రోగులు ముందు ముందు రోజుల్లో ఇబ్బంది పడవలసిన అవసరం లేదని అన్నారు. రాష్ట్రంలో భాజపా ప్రభుత్వంతోనే అభివృద్ధి జరుగుతుందని వివరించారు. ఈ సమావేశంలో జిల్లా సాధారణ కార్యదర్శి జగన్నాధ్ మహాపాత్ర్, పట్టణ అధ్యక్షుడు బాలకృష్ణ ‌పాత్ర్ పాల్గొన్నారు..

S.Anil, Gajapati Dst

S.Anil, Gajapati Dst