wife leaves husband: 17 ఏళ్ల కాపురం.. కళ్ల ముందే ప్రియుడితో వెళ్లిపోయిన భార్య..!
wife leaves husband: ఉత్తరప్రదేశ్ సీతాపూర్‌లో 17 ఏళ్ల వైవాహిక బంధం విచిత్రంగా ముగిసింది.
wife leaves husband: 17 ఏళ్ల కాపురం.. కళ్ల ముందే ప్రియుడితో వెళ్లిపోయిన భార్య..!
UttarPradesh: భారతీయ సమాజంలో వివాహేతర సంబంధాలు, కుటుంబ కలహాలు అంటేనే సాధారణంగా గొడవలు, పోలీస్ స్టేషన్లు, కోర్టు కేసులు లేదా తీవ్రమైన హింస కళ్ల ముందు మెదులుతాయి. కానీ, ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఒక విచిత్రమైన సంఘటన ఇందుకు పూర్తిగా భిన్నంగా నిలిచింది. 17 ఏళ్ల సుదీర్ఘ వైవాహిక బంధానికి తెరదించుతూ.. భార్య తన ప్రియుడితో కలిసి వెళ్తానని చెప్పగా, ఆ భర్త చూపిన సంయమనం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. సోషల్ మీడియాలోనూ ఈ ఘటన విపరీతంగా వైరల్ అవుతోంది.
ఉత్తరప్రదేశ్‌లోని సీతాపూర్ జిల్లా మిశ్రిఖ్ ప్రాంతానికి చెందిన విపిన్ భరద్వాజ్‌కు, అదే ప్రాంతానికి చెందిన యువతితో 2009లో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు సంతానం కూడా ఉన్నారు. చాలా ఏళ్లపాటు వీరి కాపురం ఎలాంటిొ గొడవలు లేకుండా సాఫీగానే సాగింది. అయితే కాలక్రమేణా వీరి మధ్య మనస్పర్థలు తలెత్తడంతో పాటు, మూడో వ్యక్తి ప్రవేశం వారి కుటుంబంలో చిచ్చుపెట్టింది. ఈ క్రమంలోనే సుమారు 22 రోజుల క్రితం ఆ వివాహిత ఇంట్లో ఎవరికీ చెప్పకుండా అకస్మాత్తుగా అదృశ్యమైంది. కుటుంబ సభ్యులు ఎంత వెతికినా ఆచూకీ దొరకలేదు.
కొన్ని రోజుల తర్వాత ఇంటికి తిరిగి వచ్చిన ఆ మహిళ అసలు నిజం బయటపెట్టింది. అంబేడ్కర్ నగర్ ప్రాంతానికి చెందిన రాహుల్ అనే వ్యక్తితో తనకు పరిచయం ఏర్పడిందని, ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారిందని తేల్చిచెప్పింది. ఇకపై భర్తతో కలిసి ఉండలేనని, తన ప్రియుడు రాహుల్‌తోనే జీవితాన్ని పంచుకుంటానని కుండబద్దలు కొట్టింది. కుటుంబ సభ్యులు ఎంత సర్దిచెప్పినప్పటికీ ఆమె తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. ప్రియుడితోనే వెళ్తానని తీవ్రంగా పట్టుబట్టింది.
తన భార్య చేసిన పనికి ఆ భర్త గుండె పగిలిపోయినా.. ఆయన కోపాన్ని అణచుకుని అసాధారణ సంయమనం పాటించారు. ఇద్దరు పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, బలవంతంగా బంధంలో బంధించి ఉంచడం సబబు కాదని భావించారు. ఆమె ఇష్టాన్ని గౌరవిస్తూ శాంతియుతంగా సాగనంపేందుకు అంగీకరించారు. స్థానికులు, ఇరువైపులా పెద్దమనుషుల సమక్షంలో ఎలాంటి గొడవలకు తావులేకుండా పెద్దల సమక్షంలో రాజీ కుదుర్చుకున్నారు. భార్యను స్వయంగా ప్రియుడు రాహుల్‌తో కలిసి వెళ్లేందుకు వీడ్కోలు పలికారు.
సాధారణంగా ఇలాంటి సున్నితమైన అంశాలు పెద్ద రచ్చకు, దాడులకు దారితీస్తుంటాయి. కానీ, విపిన్ భరద్వాజ్ ఎలాంటి హింసకు పాల్పడకుండా, తన భార్య కోరిక మేరకు ఆమెను ప్రియుడికి అప్పగించి ప్రశాంతంగా పంపించిన తీరు స్థానికులను విస్మయానికి గురిచేసింది. ప్రస్తుతం ఈ విచిత్రమైన ప్రేమ కథ, భర్త చూపిన పరిపక్వత సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.




