Yadadri: యాదాద్రి జిల్లాలో విషాదం..బెట్టింగ్ యాప్‌కు బలి అయిన యువకుడు!

Yadadri: యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలం రేణుకుంటలో ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్ వ్యసనంతో అప్పులపాలై భారత్ కుమార్ అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు.

T RAMREDDY, BHONAGIRI
Published on: 26 Oct 2026 3:39 PM IST
Yadadri
X

Yadadri: యాదాద్రి జిల్లాలో విషాదం..బెట్టింగ్ యాప్‌కు బలి అయిన యువకుడు!

Yadadri: బెట్టింగ్ యాప్‌ల వ్యసనం మరో కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది.. ఆన్‌లైన్ బెట్టింగ్‌లో డబ్బులు కోల్పోయి.. అప్పుల భారంతో సతమతమైన ఓ యువకుడు చివరకు ప్రాణాలు తీసుకున్న ఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలో కలకలం రేపుతోంది.

భార్యపై ప్రేమ.. కన్నకూతురిపై బాధ్యత.. కానీ అప్పుల భారం నుంచి బయటపడలేక బలవన్మరణానికి పాల్పడిన భారత్ కుమార్ ఉదంతం అందరినీ కలచివేస్తోంది.

యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలం రేణుకుంట గ్రామానికి చెందిన గందమల్ల భారత్ కుమార్.. భువనగిరి పట్టణంలో ఓ ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. అయితే బెట్టింగ్ యాప్‌లకు అలవాటుపడి డబ్బులు కోల్పోవడంతో అప్పుల పాలైనట్లు సమాచారం.

పండుగ సందర్భంగా భార్య సంతోష తన గ్రామానికి వెళ్లింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో భారత్ కుమార్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.అయితే భార్య ఫోన్ వాట్సప్ ద్వారా ఆత్మహత్య చేసుకుంటున్నాను మెసేజ్..తర్వాత ఉరి వేసుకుని ఆత్మహత్య పాల్పడ్డాడు.. భారత్ కుమార్ రాసిన సూసైడ్ నోట్‌లోని మాటలు హృదయాన్ని కలచివేస్తున్నాయి.

“నన్ను క్షమించు.. ఎన్నిసార్లు మారాలనుకున్నా మారలేకపోయాను. నీలాంటి భార్య దొరకడం నా అదృష్టం. నీకు, పాపకు సారీ చెబుతున్నాను.. పాపను జాగ్రత్తగా చూసుకో” అంటూ భార్యను ఉద్దేశించి రాసినట్లు సమాచారం.

తనను నమ్ముకున్న భార్య.. తనపై ఆధారపడిన చిన్నారి.. వీరితో కలిసి భవిష్యత్తులో జీవించాల్సిన యువకుడు.. అప్పులు, బెట్టింగ్ వ్యసనం నుంచి బయటపడలేక తన జీవితాన్ని అర్ధాంతరంగా ముగించుకోవడం విషాదకరం.

T RAMREDDY, BHONAGIRI

T RAMREDDY, BHONAGIRI