Yadagirigutta: 33 రోజుల్లో రూ. 2.59 కోట్ల లక్ష్మీనరసింహ స్వామి హుండీ ఆదాయం

Yadagirigutta: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామివారి హుండీ ఆదాయం రూ. 2.59 కోట్లు. 33 రోజుల్లో భక్తులు సమర్పించిన నగదు, బంగారం, వెండి వివరాలు వెల్లడించిన ఈవో.

Saleem, Nalgonda
Published on: 22 Sept 2026 10:07 PM IST
Yadagirigutta
X

Yadagirigutta: 33 రోజుల్లో రూ. 2.59 కోట్ల లక్ష్మీనరసింహ స్వామి హుండీ ఆదాయం

యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి ఆలయంలో గడిచిన 33 రోజులకు సంబంధించిన హుండీ కానుకల లెక్కింపును మంగళవారం కొండపైన హాల్‌లో అత్యంత పటిష్ట భద్రత మధ్య నిర్వహించారు.

భక్తులు సమర్పించిన కానుకల ద్వారా స్వామివారికి రూ. 2,59,03,628 నగదు ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈవో భవానీ శంకర్ వెల్లడించారు.

నగదుతో పాటు 32 గ్రాముల మిశ్రమ బంగారం, 3 కిలోల 950 గ్రాముల మిశ్రమ వెండి కానుకలుగా వచ్చినట్లు తెలిపారు. ఆలయ అధికారులు, సిబ్బంది సమక్షంలో చేపట్టిన ఈ లెక్కింపు ప్రక్రియను సీసీ కెమెరాల నిఘా మధ్య పూర్తి చేసినట్లు స్పష్టం చేశారు.

స్వయంభూ శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి దర్శనార్థం వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో విచ్చేసిన భక్తులు తమ మొక్కుబడులు చెల్లించుకుని హుండీలో కానుకలు సమర్పించుకున్నారని ఆలయ వర్గాలు తెలిపాయి.

Saleem, Nalgonda

Saleem, Nalgonda