Nalgonda: యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ చీఫ్ ఇంజనీర్ సస్పెన్షన్!

Nalgonda: యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ (YTPS) చీఫ్ ఇంజనీర్ సురేష్ నాయక్‌పై సస్పెన్షన్ వేటు పడింది.

PARAMESH, NALGONDA & SURYAPET
Published on: 15 Oct 2026 11:00 AM IST
Nalgonda
X

Nalgonda: యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ చీఫ్ ఇంజనీర్ సస్పెన్షన్!

Nalgonda: యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ స్టేజ్-1 CE సురేష్ నాయక్‌పై సస్పెన్షన్ వేటు. ​ఎనర్జీ సెక్రటరీ ఆదేశాలతో చీఫ్ ఇంజనీర్‌ను సస్పెండ్ చేసిన జెన్కో CMD హరీష్. ​800 మెగావాట్ల యూనిట్-1 నిలిచిపోవడంపై సీరియస్.. పవర్ జనరేషన్ లాస్‌కు CEదే బాధ్యతగా గుర్తింపు. సిబ్బందిని సమన్వయం చేయడంలో, పనులు పూర్తి చేయడంలో CE నిర్లక్ష్యం వహించినట్లు ఆరోపణలు.

గత నెలలోనే LDO ఆయిల్ స్టాక్ మెయింటెనెన్స్ లోపంతో DE సస్పెన్షన్.. తాజాగా CEపై వేటు. ​గత నెల రోజులుగా వైటీపీఎస్‌పై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి.. వెంటవెంటనే ఉన్నతాధికారుల ఆకస్మిక తనిఖీలు. ​మహానది కోల్డ్ బెల్ట్ నుంచి బొగ్గు సరఫరా పెంచినా తీరని సాంకేతిక సమస్యలు.

కన్వేయర్ బెల్ట్ సగం సామర్థ్యంతోనే పని చేయడంపై ఆందోళన.. లోడ్ పెంచితే తెగిపోతున్న పరిస్థితి. ​క్వాలిటీ లేకుండానే PG టెస్టులు పూర్తి.. ఏడాదికే బయటపడుతున్న సాంకేతిక లోపాలు. తీవ్రంగా పీడిస్తున్న సిబ్బంది కొరత.. ఒకేసారి 2 నుంచి 3 షిఫ్టులు చేస్తున్న ఉద్యోగులు.

యాష్ వాటర్ రికవరీ సిస్టమ్ విఫలం.. కృష్ణా నదిలో కలుస్తున్న బూడిద నీరు. PG టెస్టులు, క్వాలిటీ లోపాలపై పూర్తిస్థాయిలో దృష్టి సారించాలని నిర్ణయించిన అధికార వర్గాలు.

PARAMESH, NALGONDA & SURYAPET

PARAMESH, NALGONDA & SURYAPET