Nalgonda: చిట్యాల మండలంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించిన విప్!
Nalgonda: నకిరేకల్ నియోజకవర్గం చిట్యాల మండలం చిన్న కాపర్తి, పెద్దకాపర్తి, అరేగూడం గ్రామాల్లో PACS ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను విప్ వేముల వీరేశం ప్రారంభించారు.
Nalgonda: చిట్యాల మండలంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించిన విప్!
Nalgonda: చిట్యాల మండలం, చిన్న కాపర్తి, అరేగూడం, పెద్దకాపర్తి, గ్రామాల్లో PACS ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం మద్దతు ధరకే కొనుగోలు చేస్తుందని, కొనుగోలు కేంద్రంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, రైతులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.




