Nalgonda: నకిరేకల్‌లో లబ్ధిదారులకు సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు పంపిణీ!

Nalgonda: నకిరేకల్ క్యాంపు కార్యాలయంలో 191 మంది లబ్ధిదారులకు రూ.85.30 లక్షల విలువైన సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను అందజేసిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే వేముల వీరేశం.

PARAMESH, NALGONDA & SURYAPET
Published on: 5 Oct 2026 1:32 PM IST
Nalgonda
X

Nalgonda: నకిరేకల్‌లో లబ్ధిదారులకు సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు పంపిణీ!

Nalgonda: నల్లగొండ జిల్లా నకిరేకల్ పట్టణంలోని పన్నాలగూడెం క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాలకు చెందిన 191 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) ద్వారా మంజూరైన రూ.85 లక్షల 30 వేల 500 విలువైన చెక్కులను ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఆర్థిక ఇబ్బందులతో వైద్య చికిత్స పొందుతున్న పేద, మధ్యతరగతి కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా కృషి చేస్తామని పేర్కొన్నారు.

CMRF ద్వారా లబ్ధి పొందిన కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని, ప్రజలు అవసరమైన సందర్భాల్లో ముఖ్యమంత్రి సహాయ నిధిని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు.ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అధికారులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

PARAMESH, NALGONDA & SURYAPET

PARAMESH, NALGONDA & SURYAPET