Nalgonda: పేద విద్యార్థిని ఎంబీబీఎస్ చదువుకు అండగా నిలిచిన విప్ వేముల వీరేశం!

Nalgonda: నల్లగొండ జిల్లా చిట్యాలలో కాంగ్రెస్ కార్యకర్త కూతురు సాద్విక ఎంబీబీఎస్ చదువుకు రూ. 1.20 లక్షల మొదటి సంవత్సరం ఫీజు అందజేసిన ప్రభుత్వ విప్ వేముల వీరేశం.

PARAMESH, NALGONDA & SURYAPET
Published on: 10 Oct 2026 12:34 PM IST
Nalgonda
X

Nalgonda: పేద విద్యార్థిని ఎంబీబీఎస్ చదువుకు అండగా నిలిచిన విప్ వేముల వీరేశం!

Nalgonda: నల్లగొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీ 7వ వార్డుకు చెందిన కాంగ్రెస్ కార్యకర్త బూడిద శేఖర్ అనారోగ్యంతో మృతి చెందగా, ఆ కుటుంబ ఆర్థిక పరిస్థితి చూసి చలించిన ప్రభుత్వ విప్ వేముల వీరేశం సాద్విక MBBS చదువు ఖర్చు మొత్తం తానే భరిస్తానని మాట ఇచ్చారు..ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు సాద్విక మొదటి సంవత్సర MBBS ఫీజు రూ.1,20,000/- ను ఆమె చేతికి అందించారు. మిగిలిన 4 సంవత్సరాల ఫీజు కూడా తానే కడతానని హామీ ఇచ్చారు.

అనంతరం తన కూతురు కూడా MBBS చదువుతోందని, చదువులో ఏదైనా సందేహం ఉన్నా, ఏ సహాయం కావాలన్నా తన కూతురు విన్నుత్న ను సంప్రదించాలని చెబుతూ, తన కూతురు విన్నుత్నను సాద్వికకు పరిచయం చేశారు. బాగా చదువుకొని తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలని ఆకాంక్షించారు. ఎమ్మెల్యే గారి గొప్ప మనసుకు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో చిట్యాల మున్సిపాలిటీ కౌన్సిలర్ దేశపాక లతా రాజేష్ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

PARAMESH, NALGONDA & SURYAPET

PARAMESH, NALGONDA & SURYAPET