Maddirala: మద్దిరాల కస్తూర్బా పాఠశాలలో నీటి కష్టాలు

Maddirala: మద్దిరాల కేజీబీవీలో మూడు రోజులుగా నీటి సరఫరా లేక విద్యార్థినులు అవస్థలు పడుతున్నారు; చెరువు నీటితో ఎలర్జీలు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

Muragundla, Veeraiah, Tungathurthy
Published on: 8 Nov 2026 5:15 PM IST
Maddirala
X

Maddirala: మద్దిరాల కస్తూర్బా పాఠశాలలో నీటి కష్టాలు

సూర్యాపేట జిల్లా: తుంగతుర్తి నియోజకవర్గం మద్దిరాల మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో నీటి సరఫరా లేక విద్యార్థినులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత మూడు రోజులుగా పాఠశాలకు గ్రామపంచాయతీ ట్యాంకర్ ద్వారా చెరువు నీటిని సరఫరా చేస్తున్నారని విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

చెరువు నీటిని ఉపయోగించడం వల్ల తమకు ఎలర్జీ వంటి సమస్యలు వస్తున్నాయని విద్యార్థినులు చెబుతున్నారు. గత రెండు మూడు రోజులుగా స్నానాలు చేయడానికి, బట్టలు ఉతుక్కోవడానికి కూడా నీరు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వాపోతున్నారు.

నీటి కొరత కారణంగా ఉపాధ్యాయులు మూడు రోజుల పాటు సెలవులు ప్రకటించారని విద్యార్థినులు తెలిపారు. ఈ సమస్యపై పలుమార్లు ఎస్‌ఓ మేడం దృష్టికి తీసుకెళ్లి తమ ఇబ్బందులను వివరించినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదని బాలికలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థినుల ఆరోగ్యం, పరిశుభ్రతను దృష్టిలో ఉంచుకుని సంబంధిత అధికారులు వెంటనే స్పందించాలని, పాఠశాలకు స్వచ్ఛమైన తాగునీటితో పాటు అవసరమైన నీటి సరఫరాను పునరుద్ధరించాలని విద్యార్థినులు, వారి తల్లిదండ్రులు కోరుతున్నారు.

Muragundla, Veeraiah, Tungathurthy

Muragundla, Veeraiah, Tungathurthy