Nalgonda: కొండమల్లేపల్లి బస్టాండ్‌లో ప్రయాణికుల అవస్థలు.. రూ.25కు వాటర్ బాటిల్!

Nalgonda: కొండమల్లేపల్లి ఆర్టీసీ బస్టాండ్‌లో తాగునీటి కొరత, దుర్వాసనతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు.

BIJILI LINGIAIH, DEVARAKONDA
Published on: 19 Nov 2026 10:49 AM IST
Nalgonda
X

Nalgonda: కొండమల్లేపల్లి బస్టాండ్‌లో ప్రయాణికుల అవస్థలు.. రూ.25కు వాటర్ బాటిల్!

Nalgonda: కొండమల్లేపల్లి మండల కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్‌లో ప్రయాణికులకు కనీస మౌలిక వసతులు కరువయ్యాయని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బస్టాండ్ పరిసరాల్లో దుర్వాసన వెదజల్లుతుండటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

మరోవైపు బస్టాండ్‌లో తాగునీటి సౌకర్యం సరిగా లేకపోవడంతో ప్రయాణికులు బయట నుంచి వాటర్ బాటిళ్లు కొనుగోలు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే ఒక వాటర్ బాటిల్‌ను రూ.25కు విక్రయిస్తూ, బాటిల్‌పై ముద్రించిన ఎంఆర్‌పీ ధర కంటే అధికంగా వసూలు చేస్తున్నారని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు.

ప్రయాణికులకు కనీసం తాగునీరు అందుబాటులో లేకపోవడం, బస్టాండ్‌లో అపరిశుభ్రతతో దుర్వాసన రావడం పట్ల ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యలపై పలుమార్లు ఆర్టీసీ సిబ్బంది దృష్టికి తీసుకెళ్లినా సరైన స్పందన కనిపించడం లేదని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు.

ప్రతిరోజూ వందలాది మంది ప్రయాణికులు రాకపోకలు సాగించే బస్టాండ్‌లో ఇలాంటి పరిస్థితులు కొనసాగడం పట్ల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇకనైనా ఆర్టీసీ ఉన్నతాధికారులు స్పందించి బస్టాండ్‌ను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు ఉచిత తాగునీటి సౌకర్యం కల్పించాలని, ఎంఆర్‌పీ కంటే అధిక ధరలకు వాటర్ బాటిళ్లు విక్రయిస్తున్నారనే ఆరోపణలపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు.

BIJILI LINGIAIH, DEVARAKONDA

BIJILI LINGIAIH, DEVARAKONDA