Huzurnagar: హుజూర్‌నగర్ ఆలయ ఈవోకు వీడ్కోలు సన్మానం
Huzurnagar: హుజూర్‌నగర్ శ్రీ వేణుగోపాల సీతారామచంద్రస్వామి ఆలయ ఈవో గుజ్జుల కొండారెడ్డికి వీడ్కోలు, నూతన ఈవో మరింగంటి శరత్చంద్రకు స్వాగతం పలికారు.
Huzurnagar: హుజూర్‌నగర్ ఆలయ ఈవోకు వీడ్కోలు సన్మానం
Huzurnagar: స్థానిక శ్రీ వేణుగోపాల సీతారామచంద్రస్వామి దేవస్థానంలో గత పది సంవత్సరాలుగా కార్యనిర్వహణాధికారిగా విశిష్ట సేవలందించిన గుజ్జుల కొండారెడ్డి గారికి గ్రేడ్-1 పదోన్నతి లభించి, కల్లేపల్లి బంగారు మైసమ్మ దేవాలయానికి రెగ్యులర్ కార్యనిర్వహణాధికారిగా బదిలీ అయిన సందర్భంగా దేవస్థానంలో ఘనంగా వీడ్కోలు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. అదే సమయంలో, శ్రీ వేణుగోపాల సీతారామచంద్రస్వామి దేవస్థానం నూతన కార్యనిర్వహణాధికారిగా బాధ్యతలు స్వీకరించిన శ్రీ మరింగంటి శరత్చంద్ర గారికి ఘనంగా స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు మాట్లాడుతూ, గుజ్జుల కొండారెడ్డి గారు గత పది సంవత్సరాలుగా దేవస్థాన కార్యనిర్వహణాధికారిగా విధులు నిర్వహిస్తూ, అందరినీ కలుపుకొని ముందుకు సాగారని కొనియాడారు. దేవస్థాన అభివృద్ధికి సంబంధించి అనువంశిక ధర్మకర్తలు, అర్చకులు, భక్తులు, అభివృద్ధి సమితి సభ్యుల సలహాలు, సూచనలను పరిగణనలోకి తీసుకుంటూ సమన్వయంతో పనిచేశారని పేర్కొన్నారు.
అందరితో సత్సంబంధాలు కొనసాగిస్తూ, దేవస్థాన అభివృద్ధికి తన వంతు కృషి చేశారని ప్రశంసించారు. అందరితో కలిసి పనిచేయడం అభినందనీయమని పలువురు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఆయన అందించిన సేవలను ఈ సందర్భంగా గుర్తుచేసుకుంటూ, భవిష్యత్తులో మరింత ఉన్నత పదవులు చేపట్టి ప్రజలకు, దేవస్థానాలకు మరిన్ని సేవలందించాలని ఆకాంక్షించారు. పదోన్నతిపై మరో దేవాలయానికి బదిలీ అయినప్పటికీ, స్థానిక దేవస్థానంతో ఆయనకు ఏర్పడిన అనుబంధం చిరస్మరణీయమని పేర్కొన్నారు.
అనంతరం నూతన కార్యనిర్వహణాధికారిగా బాధ్యతలు స్వీకరించిన శ్రీ మరింగంటి శరత్చంద్ర గారిని ఉద్దేశించి పలువురు మాట్లాడుతూ, గతంలో ఈవో లు దేవస్థాన అభివృద్ధికి చేసిన కృషిని ఆదర్శంగా తీసుకొని, అంతకంటే మరింత అభివృద్ధి సాధించే దిశగా ముందుకు సాగాలని కోరారు. దేవస్థానానికి ఉన్న ప్రాధాన్యతను మరింత పెంచుతూ, భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడం, ఆలయ అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయడం, సంప్రదాయ ఆచార వ్యవహారాలను పరిరక్షించడం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.
అలాగే దేవస్థాన అభివృద్ధికి సంబంధించి అనువంశిక ధర్మకర్తలు, అర్చకులు, స్థానాచార్యులు, అభివృద్ధి సమితి సభ్యులు, భక్తుల సలహాలు, సూచనలను స్వీకరిస్తూ సమన్వయంతో పనిచేయాలని ఆకాంక్షించారు. అందరి సహకారంతో శ్రీ వేణుగోపాల సీతారామచంద్రస్వామి దేవస్థానాన్ని మరింత అభివృద్ధి పథంలో నడిపించి, భక్తుల విశ్వాసాన్ని మరింత పెంపొందించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో అనువంశిక ధర్మకర్తలు ముడుంబ రామకృష్ణమాచార్యులు, ముడుంబ జగన్నాథాచార్యులు, అర్చకులు రాఘవాచార్యులు మరియు వారి బృందం పాల్గొన్నారు. దేవాలయ అభివృద్ధి సమితి సభ్యులు గుండా రమేష్, కోట సూర్యప్రకాష్ రావు, కోట హరిప్రసాద్, రామిశెట్టి రాము, గుండా రామనాగేశ్వరరావు, కె.వి.ఎన్. మూర్తి, కొండయ్య, చంద్రశేఖర్, పొనుగుపాటి అశోక్, నరసింహమూర్తి, భారతమ్మ, పిచ్చమ్మ, వెన్న పద్మ తిరుపా రెడ్డి గారు దేవస్థాన కౌలుదారులు సుభాష్ రెడ్డి, చిన్న వెంకటరెడ్డి, సాగర్ రెడ్డితో పాటు దేవస్థాన సిబ్బంది కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని, బదిలీపై వెళ్తున్న గుజ్జుల కొండారెడ్డి గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, నూతన కార్యనిర్వహణాధికారి శ్రీ మరింగంటి శరత్చంద్ర గారికి అభినందనలు తెలియజేస్తూ పూలమాలలు శాలువలు తో సత్కరించారు.




