Nalgonda: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు ప్రారంభం..ఏనుగుల రాకేష్ రెడ్డి పిలుపు!

Nalgonda: వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటర్ల నమోదు ప్రారంభం. నవంబరు 6 వరకు అవకాశం, కంచర్ల భూపాల్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో ఉచిత సేవలు.

Saleem, Nalgonda
Published on: 5 Oct 2026 2:53 PM IST
Nalgonda
X

Nalgonda: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు ప్రారంభం..ఏనుగుల రాకేష్ రెడ్డి పిలుపు!

Nalgonda: వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఓటరు నమోదు ప్రక్రియ ప్రారంభమైంది. 2023 నవంబరు నాటికి డిగ్రీ లేదా సమానమైన డిప్లొమా పూర్తి చేసిన స్థానిక పట్టభద్రులు ఫారం-18 ద్వారా దరఖాస్తు చేసుకోవాలని మాజీ ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి తెలిపారు. నవంబరు 6 వరకు ఓటరుగా నమోదు చేసుకునేందుకు అవకాశం ఉందని, అర్హులైన ప్రతి ఒక్కరూ https://ceotelangana.nic.in వెబ్‌సైట్ ద్వారా పేరు నమోదు చేసుకోవాలని కోరారు.

ఓటర్ల సౌకర్యార్థం నల్గొండలోని మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో ఉచిత ఎన్రోల్మెంట్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేశామని తెలిపారు.ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ సేవలు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు . ఓటర్ ఐడీ, ఆధార్ కార్డు, డిగ్రీ/డిప్లొమా సర్టిఫికెట్, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో, మొబైల్ నంబర్.

​సమాచారం కోసం: 9618539762, 7995908512 నంబర్లను సంప్రదించవచ్చని అన్నారు.

Saleem, Nalgonda

Saleem, Nalgonda