Chintapally: మంత్రి సీతక్క ఎస్పీకి లేఖ రాసినా చర్యలు తీసుకోవడం లేదని ఆవేదన!
Chintapally: చింతపల్లి మండలం హరిజనాపురంలో ప్రేమ పెళ్లి చేసుకున్న మూడు నెలలకే అదనపు కట్నం కోసం భర్త, అంగన్వాడీ టీచర్ అయిన అత్త వేధిస్తున్నారని బాధితురాలు వాపోయింది.
Chintapally: మంత్రి సీతక్క ఎస్పీకి లేఖ రాసినా చర్యలు తీసుకోవడం లేదని ఆవేదన!
Chintapally: చింతపల్లి మండలంలోని హరిజనాపురం గ్రామంలో వరకట్న వేధింపుల ఘటన కలకలం రేపుతోంది. ప్రేమ పేరుతో మూడేళ్ల పాటు యువతిని నమ్మించి వివాహం చేసుకున్న మూడు నెలలకే భర్త, అత్త అంగన్ వాడి టీచర్ అదనపు కట్నం కోసం వేధింపులకు గురిచేసి తల్లిగారి ఇంటికి పంపించేశారని బాధితురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.
హరిజనాపురం గ్రామానికి చెందిన అంగన్వాడీ టీచర్ నల్ల భారతమ్మ కుమారుడు నల్ల వినయ్ కుమార్ అనే యువకుడు అదే గ్రామానికి అంకూరి యాదయ్య చిన్న కుమార్తెను మూడేళ్ల పాటు ప్రేమించి, ఆమెకు వచ్చిన ఇతర పెళ్లి సంబంధాలను కూడా చెడగొట్టి, తానే వివాహం చేసుకుంటానని నమ్మబలికించి చలిదోన లక్ష్మీనరసింహ స్వామి సన్నిధిలో ఇరు కుటుంబాల, పెద్దల సమక్షంలో వివాహం జరగగా, పెళ్లి సమయంలో రూ.5 లక్షల నగదు, ఐదు తులాల బంగారం కట్న కానుకలుగా ఇచ్చినట్లు బాధితురాలి తల్లిదండ్రులు తెలిపారు.
అయితే వివాహమైన మూడు నెలలు కూడా గడవకముందే అదనపు కట్నం తీసుకురావాలంటూ భర్తతో పాటు అత్తమామలు వేధింపులకు గురిచేశారని, మానసికంగా, శారీరకంగా చిత్రహింసలు పెట్టడంతో పాటు దాడులు చేసి దూషించి పంపించేశారని బాధితురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.ఈ ఘటనలో అంగన్వాడీ టీచర్‌గా పనిచేస్తున్న నల్ల భారతమ్మ పాత్ర ఎక్కువగా ఉందని బాధిత కుటుంబం ఆరోపణలు చేస్తోంది. ఆమెపై కూడా సంబంధిత అధికారులు విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ
ఈ విషయమై మంత్రి సీతక్కకు బాధిత కుటుంబం ఫిర్యాదు చేయగా, ఆమె నల్గొండ జిల్లా ఎస్పీకి లేఖ రాసి బాధితురాలికి న్యాయం చేయాలని సూచించినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. అనంతరం ఎస్పీ కార్యాలయం నుంచి ఈ వ్యవహారాన్ని చింతపల్లి పోలీస్ స్టేషన్‌కు పంపినప్పటికీ, ఇప్పటివరకు తమకు సరైన సమాచారం అందలేదని, న్యాయం కోసం ఎదురుచూస్తున్నామని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.యువకుడిపై గతంలో ఐదు కేసులు ఉన్నాయని బాధిత కుటుంబం ఆరోపిస్తోంది. ఈ విషయాన్ని కూడా పోలీసులు సమగ్రంగా పరిశీలించాలని వారు కోరుతున్నారు.
అధికారుల నిర్లక్ష్యం ఇంకెన్నాళ్లు?వరకట్న వేధింపులపై ఫిర్యాదు చేసినప్పటికీ తమకు న్యాయం జరగడం లేదని బాధితురాలి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మహిళల రక్షణకు ప్రభుత్వం ఎన్నో చట్టాలు తీసుకొచ్చినప్పటికీ, ఇలాంటి ఘటనల్లో బాధితులకు సకాలంలో న్యాయం అందకపోవడం బాధాకరమని పేర్కొంటున్నారు.
అంగన్వాడి టీచర్ అయినా నల్ల భారతమ్మపై చర్యలు తీసుకోకుండా గతంలో చింతపల్లి సిడిపిఓగా పనిచేసిన అధికారిని ప్రస్తుతం నల్గొండ పీడిగా పని చేస్తున్నారని ఆమె సహకారంతో భారతమ్మపై చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ తమ కూతురుకి అన్యాయం చేస్తున్నారని బాధితురాలు కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. బాధితురాలి భర్త వినయ్ కుమార్ ఫోన్లు చేసి క్రిమినల్ లాయర్ గా పనిచేస్తున్న నన్ను ఎవరు ఏం చేయలేరని..నీకు దిక్కున్న చోట చెప్పుకొమ్మని, మీ అంతు చూస్తానని.. తమ కూతురికి, మమ్మల్ని బెదిరింపులకు గురి చేస్తూ ప్రాణభయాన్ని కల్పిస్తున్నాడని బాధితురాలు తండ్రి యాదయ్య ఆరోపించారు.
జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ, మహిళా శిశు సంక్షేమ శాఖ ఉన్నతాధికారులు వెంటనే స్పందించి ఘటనపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బాధితురాలి తల్లిదండ్రులు వేడుకుంటున్నారు.బాధిత యువతికి న్యాయం జరిగే వరకు పిడి ఆఫీస్ ముందు ఎంతటి త్యాగానికైనా సిద్ధపడతామని అప్పటివరకు తమ న్యాయ పోరాటం ఆగదని కుటుంబ సభ్యులు స్పష్టం చేస్తున్నారు.




