Lingagiri: ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో క్షయ నిర్ధారణ శిబిరం

Lingagiri: లింగగిరి పిహెచ్‌సి పరిధిలోని వేపల సింగారంలో ఉచిత క్షయ నిర్ధారణ శిబిరం. తెమడ నమూనాలు సేకరించి సూర్యాపేట CBNAAT ల్యాబ్‌కు పంపిన ఆరోగ్య సిబ్బంది.

DONTHAGANI RAJA RAMESH, HUZUR NAGAR
Published on: 23 Oct 2026 4:15 PM IST
Lingagiri
X

Lingagiri: ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో క్షయ నిర్ధారణ శిబిరం

లింగగిరి: ప్రాదమిక హెల్త్ సెంటర్ లింగగిరి పరిధిలో వేపల సింగారం గ్రామం లో క్షయ నిర్ధారణ పరీక్ష శిబిరాన్ని నిర్వహించడం జరిగినది.

ఈ కార్యక్రమంలో 60 సంవత్సరాల పైబడిన మధుమేహం వ్యాధి గ్రస్తులని మరియు క్షయ వ్యాధి లక్షణాలు ఉన్నటువంటి వారిని,గత ఐదు సంవత్సరాలుగా క్షయ పేషంట్ల నుండి( తెమడ) నమూనాలు సేకరించి,పరీక్ష నిమిత్తము CBNAAT LAB సూర్యాపేట కు పంపడం జరిగింది.

కార్యక్రమంలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ పద్మ గారు, టీబీ నోడల్ అధికారి ఇందిరాలరామకృష్ణ, విలేజ్ సెక్రటరీ ప్రవీణ్ కుమార్, ANM స్వరూప ఆశా కార్యకర్తలు మరియమ్మ, అనిత,జ్యోతి, జాన్ బి పాల్గొన్నారు.

DONTHAGANI RAJA RAMESH, HUZUR NAGAR

DONTHAGANI RAJA RAMESH, HUZUR NAGAR