Nakrekal: నోముల గ్రామంలో ఇందిరమ్మ ఇంట గృహ ప్రవేశ వేడుకలో పాల్గొన్న ఎమ్మెల్యే!
Nakrekal: నోముల గ్రామానికి చెందిన మాచర్ల శంకర్ ఇందిరమ్మ ఇంట గృహ ప్రవేశ వేడుకల్లో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే వేముల వీరేశం ముఖ్య అతిథిగా పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు.
Nakrekal: నోముల గ్రామంలో ఇందిరమ్మ ఇంట గృహ ప్రవేశ వేడుకలో పాల్గొన్న ఎమ్మెల్యే!
Nakrekal: నోముల గ్రామానికి చెందిన మాచర్ల శంకర్ నూతన ఇందిరమ్మ ఇంటి గృహ ప్రవేశం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రభుత్వ విప్, నకిరేకల్ శాసనసభ్యులు వేముల వీరేశం.
ఈ సందర్భంగా నూతన గృహంలోకి అడుగుపెట్టిన శంకర్ కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. పూజా కార్యక్రమాలలో పాల్గొని, కుటుంబ సభ్యులతో కలిసి ఆనందాన్ని పంచుకున్నారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ - పేదల సొంత ఇంటి కలను నిజం చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో ప్రతి అర్హుడైన పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. ఇందిరమ్మ ఇల్లు కేవలం ఇల్లు మాత్రమే కాదు, పేద కుటుంబానికి ఆత్మగౌరవం, భరోసా అని అన్నారు.
నోముల గ్రామంలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని, ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.




