Nalgonda: నల్లగొండలో ఘనంగా ముగిసిన లతీఫ్ షా దర్గా ఉర్సు ఉత్సవాలు, ఖవ్వాలి!

Nalgonda: నల్లగొండ లతీఫ్ షా దర్గాలో ఘనంగా ముగిసిన ఉర్సు ఉత్సవాలు. మూడో రోజు రాత్రి ఆకట్టుకున్న ఖవ్వాలి కార్యక్రమం, భారీగా హాజరైన భక్తులు.

Saleem, Nalgonda
Published on: 4 Oct 2026 7:08 AM IST
Nalgonda
X

Nalgonda: నల్లగొండలో ఘనంగా ముగిసిన లతీఫ్ షా దర్గా ఉర్సు ఉత్సవాలు, ఖవ్వాలి!

Nalgonda: నల్లగొండ పట్టణం లో లతీఫ్ షా దర్గాలో ఉర్సు ఉత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. ​ఉత్సవాల్లో భాగంగా మూడో రోజు రాత్రి ఏర్పాటు చేసిన ఖవ్వాలి కార్యక్రమం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది.

​హైదరాబాద్‌కు చెందిన సయ్యద్ ఇస్మాయిల్ ఆశ్రఫీ గ్రూప్, మహారాష్ట్రకు చెందిన ఫర్హాన్ ఖాన్ ఖవ్వాలి బృందాలు ఆలపించిన భక్తి గీతాలతో దర్గా ప్రాంగణం మార్మోగింది.

​ఉర్సు ఉత్సవాల్లో ఈ ఖవ్వాలి ప్రత్యేక ఆకర్షణగా నిలవగా, భారీ సంఖ్యలో భక్తులు హాజరై తిలకించారు. ​ఈ కార్యక్రమంలో ముతవల్లిలు సయ్యద్ సమీవుల్లా ఖాద్రీ, సల్మాన్ ఖాద్రీ, దర్గా కమిటీ ప్రతినిధులు మసీయుద్దీన్, ఆజమ్ భాయ్, కౌన్సిలర్లు సమద్, ఇబ్రహీం, సీపీఎం నాయకుడు హాషం సాబ్, ఎంఐఎం జిల్లా అధ్యక్షుడు రజియుద్దీన్, దర్గా కమిటీ సభ్యులు కట్టెల శివ తదితరులు పాల్గొన్నారు.

Saleem, Nalgonda

Saleem, Nalgonda