Tungathurthi: తుంగతుర్తిలో కంటి వైద్య శిబిరాన్ని పరిశీలించిన బీజేపీ నేత సంకినేని!

Tungathurthi: సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలో అక్షర ఫౌండేషన్, శంకర కంటి ఆసుపత్రి సౌజన్యంతో ఉచిత కంటి వైద్య శిబిరం.

Muragundla, Veeraiah, Tungathurthy
Published on: 4 Oct 2026 6:34 PM IST
Tungathurthi
X

Tungathurthi: తుంగతుర్తిలో కంటి వైద్య శిబిరాన్ని పరిశీలించిన బీజేపీ నేత సంకినేని!

తుంగతుర్తి: సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం ఉచిత కంటి వైద్య శిబిరాన్ని పేద ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని బీజేపీ రాష్ట్ర నాయకులు సంకినేని రవీందర్‌రావు కోరారు. ఆదివారం తుంగతుర్తి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అక్షర ఫౌండేషన్ సహకారంతో, శంకర కంటి ఆసుపత్రి సౌజన్యంతో నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఆయన పరిశీలించారు.

ఈ సందర్భంగా సంకినేని రవీందర్‌రావు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లోని పేద ప్రజలకు ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించడంతో పాటు అవసరమైన వారికి ఉచితంగా కంటి ఆపరేషన్లు చేయడం అభినందనీయమన్నారు. శిబిరంలో మొత్తం 190 మందికి కంటి పరీక్షలు నిర్వహించగా, 30 మందిని ఆపరేషన్లకు ఎంపిక చేసినట్లు తెలిపారు.

కంటి సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా, అందుబాటులో ఉన్న ఇలాంటి ఉచిత వైద్య సేవలను ప్రజలు వినియోగించుకోవాలని ఆయన సూచించారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల పేద ప్రజలకు ఈ శిబిరం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ మల్లెపాక సాయిబాబా, ఉప్పుల లింగయ్య, పులి పంపుల సైదులు గౌడ్, అక్షర ఫౌండేషన్ చైర్మన్ రామ్‌కుమార్‌రెడ్డి, అప్పారావు, సాయికుమార్, మట్టయ్య, డాక్టర్ మస్తాన్, డాక్టర్ జెరియా, ఉష శివార్య తదితరులు పాల్గొన్నారు.

Muragundla, Veeraiah, Tungathurthy

Muragundla, Veeraiah, Tungathurthy