Suryapet: దసరా పండుగకు సూర్యాపేట డిపో నుంచి ప్రత్యేక బస్సులు!

Suryapet: దసరా రద్దీని దృష్టిలో ఉంచుకుని సూర్యాపేట డిపో నుంచి ఈ నెల 10 నుంచి 21 వరకు ప్రత్యేక బస్సులు. శ్రీశైలం బస్సుకు ఆన్‌లైన్ రిజర్వేషన్ సౌకర్యం.

PULUSU NAGARAJU, SURYAPETA
Published on: 4 Oct 2026 11:58 AM IST
Suryapet
X

Suryapet: దసరా పండుగకు సూర్యాపేట డిపో నుంచి ప్రత్యేక బస్సులు!

Suryapet: దసరా పండుగను పురస్కరించుకుని ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా సూర్యాపేట డిపో నుంచి ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు డిపో మేనేజర్ తెలిపారు.

ఈ ప్రత్యేక సర్వీసులు ఈ నెల 10వ తేదీ నుంచి 21వ తేదీ వరకు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు.

ప్రధాన వివరాలు:

హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్‌నగర్, ఎల్బీనగర్ ప్రాంతాల నుంచి సూర్యాపేటకు వచ్చే ప్రయాణికుల కోసం, అలాగే సూర్యాపేట నుంచి హైదరాబాద్ వెళ్లే వారి సౌకర్యార్థం ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశామన్నారు. అలాగే సూర్యాపేట నుంచి బయలుదేరే శ్రీశైలం బస్సుకు ఆన్‌లైన్ రిజర్వేషన్ సౌకర్యం కూడా అందుబాటులో ఉందని తెలిపారు.

ప్రయాణికులు ఈ ప్రత్యేక బస్సు సర్వీసులను వినియోగించుకుని తమ ప్రయాణాన్ని సురక్షితంగా, సుఖవంతంగా సాగించాలని డిపో మేనేజర్ కోరారు.

PULUSU NAGARAJU, SURYAPETA

PULUSU NAGARAJU, SURYAPETA