Nalgonda: నల్లగొండ ప్రకాశం బజార్లో ఎండుమిర్చి వ్యాపారుల మోసాలు!
Nalgonda: నల్లగొండ పట్టణంలోని ప్రకాశం బజార్లో కొందరు అక్రమ వ్యాపారులు ఎండుమిర్చిపై నీళ్లు చల్లి బరువు పెంచి విక్రయిస్తూ వినియోగదారులను మోసగిస్తున్న ఘటన కలకలం రేపింది.
Nalgonda: నల్లగొండ ప్రకాశం బజార్లో ఎండుమిర్చి వ్యాపారుల మోసాలు!
Nalgonda: నల్లగొండ పట్టణంలోని ఓల్డ్ కలెక్టరేట్ సమీపంలో ఉన్న ప్రకాశం బజార్ వ్యాపార ప్రాంగణంలో కొందరు అక్రమ వ్యాపారులు వినియోగదారుల జేబులకు చిల్లులు పొడుస్తున్నారు. నిత్యావసర సరుకుల కొనుగోలు కోసం వచ్చే సామాన్య ప్రజలను ఆసరాగా చేసుకుని వినూత్న రీతిలో మోసాలకు పాల్పడుతున్నారు.
ఎండుమిర్చి త్వరగా తూకం (బరువు) పెరిగేందుకు వ్యాపారులు దానిపై నీళ్లను చల్లి లేదా తడిపి విక్రయిస్తున్నారు.ఎండుమిర్చిని కొన్ని రోజులు ఉంచితే బూజు పట్టి పాడైపోయే ప్రమాదం ఉందని కొనుగోలుదారులు వాపోతున్నారు.




