Thungathurthi: తుంగతుర్తిలో విద్యుత్ కోతలు, లోవోల్టేజ్‌తో ఎండిపోతున్న పంటలు!

Thungathurthi: కరెంటు కోసం రైతులు ఎదురుచూడాల్సిన పరిస్థితి విచారకరం: సీపీఎం నేత కొలిశెట్టి యాదగిరిరావు. తుంగతుర్తిలో విద్యుత్ కోతలు, లోవోల్టేజ్ సమస్యలపై ప్రభుత్వంపై ఆగ్రహం.

Muragundla, Veeraiah, Tungathurthy
Published on: 22 Sept 2026 6:37 PM IST
Thungathurthi
X

Thungathurthi: తుంగతుర్తిలో విద్యుత్ కోతలు, లోవోల్టేజ్‌తో ఎండిపోతున్న పంటలు!

తుంగతుర్తి: సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం వర్షాభావ పరిస్థితులతో పాటు విద్యుత్‌ కోతలు, లోవోల్టేజ్ సమస్యల కారణంగా తుంగతుర్తి మండలంలోని రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొలిశెట్టి యాదగిరిరావు అన్నారు. తుంగతుర్తి మండల కేంద్రంలో ఆయన మాట్లాడుతూ రైతుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

వర్షాభావ పరిస్థితుల ప్రభావంతో రైతులు సాగు చేసిన అర ఎకరం, ఎకరం పొలాలకు సైతం సకాలంలో నీరు అందక పంటలు ఎండిపోయే పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి తోడు విద్యుత్ కోతలు, లోవోల్టేజ్ సమస్యలు రైతులను మరింత ఇబ్బందులకు గురిచేస్తున్నాయని తెలిపారు. లోవోల్టేజ్ కారణంగా ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోతుండటంతో, వాటిని వెంటనే పునరుద్ధరించడంలో జాప్యం జరుగుతోందని అన్నారు.

దీంతో రైతులు పంటలను కాపాడుకునేందుకు కరెంటు కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి రావడం విచారకరమన్నారు. రైతులు వేలు, లక్షల రూపాయలు పెట్టుబడులు పెట్టి సాగు చేస్తున్న నేపథ్యంలో వారికి నాణ్యమైన విద్యుత్‌ను 12 గంటల పాటు నిరంతరాయంగా అందించాలని డిమాండ్ చేశారు. అలాగే కన్నెపల్లి పంప్‌హౌస్‌ నుంచి నీటిని విడుదల చేసి రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యులు బూర శ్రీనివాస్ గౌడ్, నాయకులు మండల వెంకటరెడ్డి, కందుకూరి చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.

Muragundla, Veeraiah, Tungathurthy

Muragundla, Veeraiah, Tungathurthy