Miryalaguda: మిర్యాలగూడలో విషాదం.. గ్యాస్ సిలిండర్ పేలి ముగ్గురు సజీవ దహనం!
Miryalaguda: నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఘోర అగ్ని ప్రమాదం. గ్యాస్ సిలిండర్ పేలి ముగ్గురు సజీవ దహనం.
Miryalaguda: మిర్యాలగూడలో విషాదం.. గ్యాస్ సిలిండర్ పేలి ముగ్గురు సజీవ దహనం!
నల్గొండ జిల్లా: మిర్యాలగూడ పట్టణంలోని కలల్‌వాడ కాలనీలో అర్ధరాత్రి భారీ అగ్ని ప్రమాదం పేలుడు శబ్దంతో ఒక్కసారిగా ఉలిక్కి పడ్డ . స్థానికులు సమాచారం ప్రకారం, విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఇంట్లో ఉన్న గ్యాస్ సిలిండర్ పేలిపోవడంతో మంటలు వేగంగా వ్యాపించాయి.పేలుడు ధాటికి ఇంటి మొత్తం అగ్నికి ఆహుతవగా, మంటలు భారీగా ఎగసిపడ్డాయి. ప్రమాద సమయంలో ఇంట్లో ఉన్న చంద్రమ్మ (45), ఆమె మనవడు లక్ష్మణ్, మనవరాలు ప్రణీతి బయటకు వచ్చే అవకాశం లేకపోవడంతో సజీవ దహనమైనట్లు తెలుస్తోంది.
అర్ధరాత్రి అందరూ గాఢ నిద్రలో ఉండటంతో ప్రమాదాన్ని గుర్తించేందుకు కొంత సమయం పట్టింది. పేలుడు శబ్దం విన్న కాలనీ వాసులు వెంటనే బయటకు వచ్చి సహాయక చర్యలు చేపట్టినా, అప్పటికే మంటలు తీవ్రరూపం దాల్చాయి.సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.




