Suryapet: ఆర్టీసీ కార్మికుల హక్కుల రక్షణకే TWU-SWF కూటమి: సర్వోత్తమ్ రెడ్డి!
Suryapet: ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికలు సూర్యాపేట డిపోలో ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి ప్రచారం TWU-SWF కూటమికి మద్దతు ఇవ్వాలని కార్మికులకు పిలుపు.
Suryapet: ఆర్టీసీ కార్మికుల హక్కుల రక్షణకే TWU-SWF కూటమి: సర్వోత్తమ్ రెడ్డి!
సూర్యాపేట: తెలంగాణ ఆర్టీసీ గుర్తింపు యూనియన్ ఎన్నికల నేపథ్యంలో సూర్యాపేట డిపోలో ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి ప్రచారం నిర్వహించారు. అక్టోబర్ 9న జరగనున్న TGSRTC గుర్తింపు యూనియన్ ఎన్నికల్లో TWU-SWF కూటమి తరఫున బాణం, నక్షత్రం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కార్మికులను కోరారు. TMU బలపరిచిన TWU-SWF కూటమి అభ్యర్థులను గెలిపించడం ద్వారా కార్మికుల సమస్యలు, హక్కులపై మరింత బలంగా పోరాడేందుకు అవకాశం కలుగుతుందని అన్నారు.
ఈ సందర్భంగా ఆర్టీసీ కార్మికులను కలిసి వారి సమస్యలు, హక్కులు, సంక్షేమానికి సంబంధించిన అంశాలపై చర్చించారు. కార్మికుల ఉద్యోగ భద్రత, మెరుగైన వేతనాలు, పదోన్నతులు, ఆరోగ్య భద్రత, కుటుంబ సంక్షేమం, పెండింగ్ సమస్యల పరిష్కారం, సామాజిక భద్రత వంటి అంశాలపై గుర్తింపు యూనియన్ ద్వారా బలమైన వాణిని వినిపించాల్సిన అవసరం ఉందని తెలిపారు.
ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియకు సంబంధించిన అంశాలను ముందుకు తీసుకెళ్లాల్సి ఉందని, కార్మికుల సమస్యల పరిష్కారానికి సంఘటితంగా కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు.
ఆర్టీసీ సంస్థను లాభాల బాటలో నడిపించి, నూతన ఉద్యోగాలు కల్పించి ఆర్టీసీ కార్మికులను ఆదుకున్న పార్టీ కాంగ్రెస్ అని, ఆర్టీసీ సంస్థను బలోపేతం చేయడం, కార్మిక సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తామని హామీ ఇచ్చారు.




