Nalgonda: నల్లగొండ TGSRTCకి పండుగ 'పంట' – రూ.35.98 కోట్ల రాబడి!
Nalgonda: నల్లగొండ TGSRTC రీజియన్‌కు పండుగ సీజన్లో రూ.35.98 కోట్ల ఆదాయం. 50.99 లక్షల కిమీ బస్సులు నడిపి 49.34 లక్షల మంది ప్రయాణికులను చేరవేసిన సంస్థ.
Nalgonda: నల్లగొండ TGSRTCకి పండుగ 'పంట' – రూ.35.98 కోట్ల రాబడి!
నల్లగొండ: బతుకమ్మ, దసరా పండుగల వేళ TGSRTC నల్లగొండ రీజియన్ భారీ ఆదాయాన్ని రాబట్టింది. ఈ నెల 9 నుంచి 26 వరకు రీజియన్‌లోని 7 డిపోల పరిధిలో 50.99 లక్షల కిలోమీటర్లు బస్సులు నడిపి రూ.35.98 కోట్ల రాబడి సాధించింది.
మొత్తం 49.34 లక్షల మంది ప్రయాణించగా, 'మహాలక్ష్మి' పథకం కింద 31.18 లక్షల మంది మహిళలు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని వినియోగించుకున్నట్లు అధికారులు తెలిపారు




