Nalgonda: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటర్ల నమోదు షెడ్యూల్ విడుదల!
Nalgonda: తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటర్ల నమోదు షెడ్యూల్ విడుదల. పాత ఓటర్లు కూడా ఫారం-18 ద్వారా మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని సీఈవో కార్యాలయం స్పష్టీకరణ.
Nalgonda: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటర్ల నమోదు షెడ్యూల్ విడుదల!
నల్గొండ: మహబూబ్‌నగర్–రంగారెడ్డి–హైదరాబాద్, వరంగల్–ఖమ్మం–నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గాల పరిధిలో నూతన ఓటర్ల నమోదుకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (CEO) కార్యాలయం షెడ్యూల్ విడుదల చేసింది. పాత జాబితాలతో ప్రమేయం లేకుండా, గతంలో ఓటు ఉన్నవారు కూడా తప్పనిసరిగా సవరించిన ఫారం-18 ద్వారా మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
CEO తెలంగాణ అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో గానీ, సంబంధిత ఎన్నికల అధికారుల (ERO/AERO) కార్యాలయాల్లో నేరుగా గానీ దరఖాస్తులు సమర్పించవచ్చు.డిగ్రీ లేదా తత్సమాన విద్యార్హత సర్టిఫికేట్ (గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి మూడేళ్లు నిండి ఉండాలి), చిరునామా ఆధార పత్రం, ఫొటో.దరఖాస్తుతో పాటు గెజిటెడ్ అధికారి సంతకం చేసిన లేదా స్వయంగా ధ్రువీకరించిన (Self-attested) సర్టిఫికేట్ల నకళ్లను జత చేయాల్సి ఉంటుంది.




