Miryalaguda: కుక్కడంలో తీన్మార్ మల్లన్న బీసీ రాజ్యాధికార యాత్ర
Miryalaguda: మిర్యాలగూడ, కుక్కడంలో బీసీ రాజ్యాధికార యాత్ర చేపట్టిన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, గౌడ సోదరులతో ముచ్చటించి వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
Miryalaguda: కుక్కడంలో తీన్మార్ మల్లన్న బీసీ రాజ్యాధికార యాత్ర
Miryalaguda: బీసీ రాజ్యాధికార యాత్రలో భాగంగా టీఆర్పీ అధినేత, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మిర్యాలగూడ నియోజకవర్గం కుక్కడం గ్రామంలో శనివారం పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక గౌడ సోదరులతో ఆయన ఆత్మీయంగా ముచ్చటించారు.
పాదయాత్రగా గ్రామంలోకి వచ్చిన మల్లన్నకు గౌడన్నలు ఘన స్వాగతం పలికారు. అనంతరం వారితో కలిసి కాసేపు సరదాగా గడిపిన ఆయన, స్వయంగా గ్లాసుల్లో కల్లు పోస్తూ గ్రామంలో సందడి చేశారు. గౌడ కులస్తుల సమస్యలను అడిగి తెలుసుకున్న మల్లన్న, వారి సంక్షేమానికి ఎల్లప్పుడూ అండగా ఉంటానని హామీ ఇచ్చారు.




