Suryapet: ప్రజా ఫిర్యాదులపై వేగంగా పోలీస్ సేవలు: ఎస్పీ నరసింహ!
Suryapet: సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పోలీసు ప్రజావాణిలో జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్ ఫిర్యాదులను స్వీకరించి ఆదేశాలు జారీ చేశారు.
Suryapet: ప్రజా ఫిర్యాదులపై వేగంగా పోలీస్ సేవలు: ఎస్పీ నరసింహ!
సూర్యాపేట: సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం పోలీసు ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి వివిధ సమస్యలపై వచ్చిన ఫిర్యాదుదారులతో జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్ స్వయంగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకుని, వినతులను పరిశీలించారు.
ప్రజలు అందించే ఫిర్యాదులపై పోలీసులు తక్షణమే స్పందించి, సమస్యలను త్వరితగతిన పరిష్కరించి బాధితులకు భరోసా కల్పించాలని సంబంధిత పోలీసు అధికారులను ఎస్పీ ఆదేశించారు. ప్రజలకు అవసరమైన సేవలు, తక్షణ సమస్యల పరిష్కారం కోసం పోలీస్ శాఖ నిరంతరం పనిచేస్తుందని తెలిపారు.
ప్రజా రక్షణ కోసం పోలీసు సిబ్బంది అనుక్షణం విధులు నిర్వర్తిస్తున్నారని ఎస్పీ పేర్కొన్నారు. ప్రజలు గొడవలు, తగాదాలకు దూరంగా ఉండాలని, సమస్యలు వచ్చినప్పుడు దాడులకు పాల్పడకుండా ఇరు వర్గాలు పెద్దల సమక్షంలో సామరస్యపూర్వకంగా, చట్ట పరిధిలో సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు. ప్రజల సమస్యలను పరిష్కరించడంలో పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని తెలిపారు.




