Huzurnagar: ఘనంగా టీఎస్‌యూటీఎఫ్‌ సూర్యాపేట జిల్లా ఆరవ మహాసభలు

Huzurnagar: హుజూర్నగర్ టౌన్ హాల్‌లో టీఎస్‌యూటీఎఫ్‌ సూర్యాపేట జిల్లా ఆరవ మహాసభలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ప్రభుత్వ విద్యారంగాన్ని పరిరక్షించాలని వక్తలు కోరారు.

DONTHAGANI RAJA RAMESH, HUZUR NAGAR
Published on: 14 Nov 2026 9:38 PM IST
Huzurnagar
X

Huzurnagar: ఘనంగా టీఎస్‌యూటీఎఫ్‌ సూర్యాపేట జిల్లా ఆరవ మహాసభలు

హుజూర్నగర్: ప్రభుత్వ విద్యారంగాన్ని పరిరక్షించుకోవాల్సిన బలోపేతం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంతోపాటు సమాజం తీసుకోవాలని మాజీ శాసన మండలి సభ్యులు అలుగుబెల్లి నర్సిరెడ్డి సూచించారు శనివారం హుజూర్నగర్ పట్టణంలోని టౌన్ హాల్ నందు టీఎస్ యుటిఎఫ్ సూర్యాపేట జిల్లా ఆరవ మహాసభలు టీఎస్ యుటిఎఫ్ జిల్లా అధ్యక్షులు ఎన్ సోమయ్య అధ్యక్షతన ప్రారంభమయ్యాయి.

మహాసభల ప్రారంభానికి ముందు ఉపాధ్యాయుల మహా ర్యాలీ పట్టణంలోని కొత్త బస్టాండ్ నుండి టౌన్ హాల్ వరకు జరిగింది.ఈ మహాసభలకు ముఖ్య అతిథిగా హాజరై మహాసభలను ప్రారంభిస్తూ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల సంఖ్య రోజు రోజుకు తగ్గుతున్న నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసి నమోదును పెంచాల్సిన బాధ్యతను ఉపాధ్యాయులు ప్రభుత్వము సమాజం తీసుకోవాలని సూచించారు. ఈ మధ్యకాలంలో పట్టణాలలో జనాభా పెరిగిన నేపథ్యంలో పట్టణ ప్రాంతంలో కొత్త పాఠశాలలను ఏర్పాటు చేయాలని సూచించారు.

టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆదిమూలం వెంకట్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులకు బోధనకు మాత్రమే పరిమితం చేయాలని సూచించారు ఈ మధ్యకాలంలో పాఠశాలలలో ఉపాధ్యాయులకు బోధనకు రెండవ ప్రాధాన్యత ఇస్తూ బోధ నేతర పనులకు మొదటి ప్రాధాన్యత ఇస్తూ పాఠశాలకు సంబంధించిన సమాచారాన్ని ఆన్లైన్లో పంపించడం గూగుల్ సీట్లు నింపడం లాంటి అనేక సాంకేతిక అంశాలకే పరిమితం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో పాఠశాలలో బోధన కుంటుపడుతుందని తద్వారా విద్యార్థులలో నాణ్యత లోపిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.

టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర పూర్వ అధ్యక్షులు సిహెచ్ రాములు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని ఉద్యోగ ఉపాధ్యాయులకు సంబంధించి రెండవ పిఆర్సి కమిషన్ రిపోర్టును వెంటనే ప్రకటించి జూలై 2023 నుంచి అమలు చేయాలని సూచించారు. విద్యా సదస్సులో జాతీయ విద్యా విధానం 2020 గత ఆరేళ్ల అమలు పరిణామాలు అనే అంశంపై ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ డాక్టర్ ఆమంచి నాగేశ్వర్ స్ఫూర్తిదాయక సందేశాన్ని ఇచ్చారు.

అనంతరం జరిగిన చైతన్య సదస్సులో అమెరికా యుధోన్మాదం ప్రపంచ సంక్షోభం అనే అంశంపై ప్రముఖ సామాజిక ఆర్థిక రాజకీయ విశ్లేషకులు డాక్టర్ అందసత్యం నిర్మాణాత్మకమైన సందేశాన్ని ఇచ్చారు. ఈ మహాసభల ప్రారంభంలో జాతీయ పతాకాన్ని ఏ రాజశేఖర్ రెడ్డి ఆహ్వాన సంఘం అధ్యక్షుడు బీరెల్లి శ్రీనివాసరెడ్డి,ఎస్ టి ఎఫ్ ఐ పతాకాన్ని జి వెంకటేశ్వర్లు టీఎస్ యుటిఎఫ్ పతాకాన్ని చెన్నా సైదులు ఆవిష్కరించారు.

ఈ జిల్లా మహాసభలలో టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ముదిరెడ్డి రాజశేఖర్ రెడ్డి రాష్ట్ర కార్యదర్శి పెరుమాళ్ళ వెంకటేశం టీఎస్ యుటిఎఫ్ సూర్యాపేట జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్ అనిల్ కుమార్ నల్లగొండ జిల్లా అధ్యక్షులు ఎర్ర శేఖర్ రెడ్డి ప్రధాన కార్యదర్శి గేర నరసింహ ఎఫ్ డబ్ల్యూ ఎస్ రాష్ట్ర కోశాధికారి ఎడ్ల సైదులు టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర ఆడిట్ కమిటీ కన్వీనర్ జాగటి యాకయ్య నల్లగొండ ఖమ్మం వరంగల్ శాసనమండలి వామపక్షాల బలపరిచిన అభ్యర్థి కొల్లి సత్యనారాయణ సూర్యాపేట టీఎన్జీవో జనరల్ సెక్రెటరీ దున్నా శ్యామ్ ,తాప్రా జిల్లా ప్రధాన కార్యదర్శి మన్నే యాదగిరి, టిఎస్పివి జిల్లా అధ్యక్షులు ఆర్ ధన మూర్తి రాష్ట్ర ఉపాధ్యక్షులు కేఏమంగ టీఎస్ యుటిఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు కే అరుణ భారతి జిల్లా కోశాధికారి గుల్ల వెంకటయ్య, మండల విద్యాధికారి సైదా నాయక్, జెవివి జిల్లా అధ్యక్షులు సైదులు,జిల్లా కార్యదర్శులు ఆర్ దామోదర్,జెట్టి కమల, నాగేశ్వరరావు, ఆడం, రమేష్, రమేష్ ,సాంబయ్య, శ్రీనివాసచారి ఆడిట్ కమిటీ సభ్యులు చిక్కుళ్ళ గోవింద్, వెంకటేశ్వర్లు, హుజూర్నగర్ , మఠంపల్లి మండలాల బాధ్యులు వీ రామకృష్ణ, ప్రభాకర్ రెడ్డి రాజశేఖర్ రెడ్డి, ఆర్ సైదులు, శ్రీనివాసరెడ్డి, జ్యోతి ,స్రవంతి, రేణుక తదితరులు పాల్గొన్నారు.

DONTHAGANI RAJA RAMESH, HUZUR NAGAR

DONTHAGANI RAJA RAMESH, HUZUR NAGAR