Suryapet: జానకీపురం కాల్పుల ఘటన: అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం!
Suryapet: సూర్యాపేట జానకీపురం వద్ద 2015లో సిమీ ఉగ్రవాదుల కాల్పుల్లో ప్రాణాలర్పించిన ఎస్ఐ సిద్ధయ్య, సిబ్బంది త్యాగాలు చిరస్మరణీయమని నివాళులర్పించారు.
Suryapet: జానకీపురం కాల్పుల ఘటన: అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం!
Suryapet: సూర్యాపేట జిల్లా జానకీపురం వద్ద 2015 ఏప్రిల్ 4న సిమీ ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు నిర్వహిస్తున్న సమయంలో జరిగిన కాల్పుల ఘటన తెలంగాణ పోలీసు చరిత్రలో విషాదకర అధ్యాయంగా నిలిచింది.
ఈ ఘటనలో ఎస్ఐ సిద్ధయ్యతో పాటు కానిస్టేబుళ్లు నాగరాజు, లింగయ్య, మహేష్ ప్రాణాలు కోల్పోయారు. ప్రజల భద్రతే లక్ష్యంగా విధులు నిర్వహిస్తూ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడిన పోలీసు అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. విధి నిర్వహణలో వారు చూపిన ధైర్యసాహసాలు, అంకితభావం భావితరాల పోలీసులకు స్ఫూర్తిదాయకం.
ప్రతి ఏడాది అక్టోబర్ 21న నిర్వహించే పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసు అమరవీరుల సేవలను స్మరించుకుంటారు. ప్రజల ప్రాణాలు, ఆస్తుల రక్షణ కోసం తమ జీవితాలను త్యాగం చేసిన వీరులకు ఘన నివాళులు అర్పిస్తున్నారు. పోలీసు అమరవీరుల త్యాగాలకు జోహార్లు.. వీరులారా మీ సేవలు చిరస్మరణీయం.




