Suryapet: సూర్యాపేటలో దుర్గాదేవిని దర్శించుకున్న పట్టణ సీఐ వెంకటయ్య
Suryapet: సూర్యాపేట 7వ వార్డులో దుర్గాదేవిని దర్శించుకున్న పట్టణ సీఐ వెంకటయ్య. టీమ్ మాత అసోసియేషన్ పూజల్లో పాల్గొని ప్రజల సౌభాగ్యం కోసం ప్రార్థన.
Suryapet: సూర్యాపేటలో దుర్గాదేవిని దర్శించుకున్న పట్టణ సీఐ వెంకటయ్య
సూర్యాపేట: సూర్యాపేట పట్టణంలోని 7వ వార్డులో కొలువుదీరిన దుర్గాదేవిని పట్టణ సీఐ వెంకటయ్య దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.మంగళవారం జిల్లా కేంద్రం 7వ వార్డ్ లో టీం మాత అసోసియేషన్ ఆధ్వర్యంలో అమ్మవారికి భక్తిశ్రద్ధలతో పూజలు చేసి, ఆశీస్సులు పొందారు.
ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. దుర్గాదేవిని దర్శించుకున్న సీఐ వెంకటయ్య అమ్మవారికి ప్రత్యేక పూజలు సమర్పించి, ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. ప్రజల జీవితాల్లో శాంతి, సౌభాగ్యం వెల్లివిరియాలని అమ్మవారిని ప్రార్థించారు.
ఈ సందర్భంగా భక్తులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. దుర్గాదేవి ఆశీస్సులతో ప్రజలందరికీ మంచి జరగాలని భక్తులు ఆకాంక్షించారు. వార్డులో అమ్మవారి దర్శనానికి భక్తులు రావడంతో ఆ ప్రాంతంలో భక్తిభావం వెల్లివిరిసింది.




