Thungathurthy: రేషన్ కార్డులో పేరున్న మహిళలందరికీ చీరలివ్వాలి: బీఆర్ఎస్!
Thungathurthy: సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం సంగెంలో రేషన్ కార్డులో పేరున్న మహిళలందరికీ సద్దుల బతుకమ్మకు ముందే చీరలు ఇవ్వాలని బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రాస్తారోకో చేపట్టారు.
Thungathurthy: రేషన్ కార్డులో పేరున్న మహిళలందరికీ చీరలివ్వాలి: బీఆర్ఎస్!
తుంగతుర్తి: రేషన్ కార్డులో పేరున్న ప్రతి మహిళకు బతుకమ్మ చీరలు పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తూ.. సంగెం గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మహిళలు నిరసన చేపట్టి రాస్తారోకో నిర్వహించారు. సద్దుల బతుకమ్మ పండుగకు ముందే అర్హులైన మహిళలందరికీ చీరలు అందించాలని వారు డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు, మాజీ ఎంపీపీ తాటికొండ సీతయ్య మాట్లాడుతూ.. గత పదేళ్ల కేసీఆర్ పాలనలో రేషన్ కార్డులో పేరుండి 18 సంవత్సరాలు నిండిన మహిళలకు సద్దుల బతుకమ్మ పండుగకు ముందే చీరలు పంపిణీ చేసేవారని గుర్తుచేశారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి ఏడాది పూర్తిస్థాయిలో చీరలు పంపిణీ చేయలేదని, రెండో ఏడాది సగం మందికే అందించారని ఆరోపించారు.
ఈ ఏడాది బతుకమ్మ పండుగ వచ్చినప్పటికీ మహిళలకు చీరలు పంపిణీ చేయకపోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ మహిళలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. మహిళలకు నెలకు రూ.2,500 ఆర్థిక సాయం, గ్యాస్ సిలిండర్పై రూ.500 సబ్సిడీ వంటి హామీలను నెరవేర్చాలని కోరారు. మహిళలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం విస్మరించిందని బీఆర్ఎస్ నాయకులు విమర్శించారు.
కేసీఆర్ నాయకత్వాన్ని బలపరచాలని, రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ నాయకులకు మద్దతు తెలపాలని తాటికొండ సీతయ్య పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మండల నాయకులు మల్యాల రాములు, మాజీ సర్పంచ్ జటంగి మల్లమ్మ, మల్లయ్య, మాజీ ఎంపీటీసీ కలకోట్ల ఎలైజర్, దుబ్బాక విజయ్, బొల్లెద్దు శ్రవణ్, దుబ్బాక సామేల్, వీరయ్య, వెంకన్న, కిరణ్, మహిళా నాయకులు మారతమ్మ, మరియమ్మ, నర్సమ్మ, శోభ, మల్లమ్మ, కళ్యాణి, లక్ష్మి, గంగమ్మ తదితరులు పాల్గొన్నారు.




